అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వాగ్దానాల మీద వర్క్ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్.. చెప్పినట్టుగానే ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం నింపుతున్నారు. తాజాగా అగ్రిగోల్డ్ బాధితుల్లో కూడా సంతోషం నింపారు సీఎం. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోపే అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
ఐదేళ్లుగా అష్టకష్టాలు పడుతున్న అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకునే ప్రక్రియను ప్రారంభించారు జగన్. తొలి విడతగా 10వేల రూపాయల లోపు డిపాజిట్లు ఉన్న బాధితుల్ని ఆదుకునేందుకు ఏకంగా 264 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఇలా ఒకేసారి 3 లక్షల 70వేల మంది బాధితుల్ని ఆదుకున్నారు. త్వరలోనే 20వేల రూపాయల లోపు డిపాజిట్లు ఉన్న బాధితుల్ని ఆదుకుంటామని వాగ్దానం చేశారు.
అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే జగన్ ఇలా తమను ఒడ్డున పడేయడంతో బాధితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇంత త్వరగా తమను ఆదుకుంటారని కలలో కూడా ఊహించలేదంటూ బాధితులు చెబుతున్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కానిది, జస్ట్ 5 నెలల్లోనే జగన్ ఆచరణలోకి తీసుకురావడంతో అంతా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
కేవలం అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోవడం మాత్రమే కాదు, యువతకు ఉపాధి కల్పించడంలో, పెన్షన్ మొత్తాన్ని పెంచడంలో, రైతుభరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లాంటి ఎన్నో పనులతో జగన్ తనదైన మార్క్ చూపించారు. నవరత్నాల అమల్లో భాగంగా ఇప్పటికే చాలా పథకాల్ని సక్సెస్ ఫుల్ గా లాంఛ్ చేశారు. త్వరలోనే అమ్మఒడి లాంటి మరికొన్ని ముఖ్యపథకాలు కూడా అమల్లోకి వస్తాయని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి.