‘తల్లి’ అయిన తరువాతే ఇంకేదైనా

తమిళనాట నుంచి తెలుగువారిని తన అందంతో, నటనతో మాయచేయడమే కాకుండా, తెలుగింటి కోడలైపోయింది సమంత. పెళ్లయిన తరువాత ఆచి తూచి సబ్జెక్ట్ లు ఎంచుకుంటూ, చేసిన ప్రతి సినిమా హిట్ అనిపించుకుంటూ ముందుకు వెళ్తోంది.…

తమిళనాట నుంచి తెలుగువారిని తన అందంతో, నటనతో మాయచేయడమే కాకుండా, తెలుగింటి కోడలైపోయింది సమంత. పెళ్లయిన తరువాత ఆచి తూచి సబ్జెక్ట్ లు ఎంచుకుంటూ, చేసిన ప్రతి సినిమా హిట్ అనిపించుకుంటూ ముందుకు వెళ్తోంది. అయితే ప్రస్తుతం 96 రీమేక్ తప్ప మరో సినిమా ఓకె చేయలేదు. అలాగే అమెజాన్ ఫ్యామిలీమన్ వెబ్ సిరీస్ సీజన్ 2 లో కనిపించబోతోంది. 

ఎందుకు మరే సినిమా ఓకె చేయడం లేదు అన్న ప్రశ్నలు, దానికి జవాబు కూడా ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది. తల్లి కావాలి అనే విషయం మీదనే ప్రస్తుతం సమంత చాలా ఆసక్తిగా వున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తగిన ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకుంటోందని, అందుకే ఇప్పట్లో సినిమా ఓకె చేసే అవకాశం తక్కువ అని తెలుస్తోంది.

మజిలీ టైమ్ లోనే సమంత తల్లి అవుతుందనే శుభవార్త వస్తుందని అక్కినేని కుటుంబం ఎదురుచూసినట్లు తెలుస్తోంది.అయితే అప్పట్లో పాజిటివ్ రిజల్ట్ రాలేదని, దానికి సమంత కాస్త బాధపడిందని కూడా మజిలీ యూనిట్ వర్గాల బోగట్టా. ఫిట్ నెస్ విషయంలో చాలా కేర్ గా వుండే సమంత అప్పటి నుంచి ఈ తల్లి కావాలనే కోరికకు అనుగుణంగా ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా వుంటూ, సినిమాల సంగతి తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

అక్కినేని ఫ్యామిలీకి నాలుగో తరం వారసుడిని అందించాలనే సమంత కోరిక నెరవేరాలని ఆశిద్దాం.