Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అమ్మయినా..నాన్నయినా..వెంకీమామే

అమ్మయినా..నాన్నయినా..వెంకీమామే

నిజ జీవితంలో మేనమామ-మేనల్లుడు అయిన వెంకీ-చైతన్య కలిసి, అదే పాత్రల్లో నటిస్తున్న సినిమా వెంకీ మామ. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 6, 25 డేట్ల మద్య ఊగిసలాట వుంది కానీ, క్రిస్మస్ డేట్ కే వస్తుందని ట్రేడ్ వర్గాల బోగట్టా. సినిమా ప్రమోషన్ లో భాగంగా తొలి పాటను ఈ రోజు విడుదల చేసారు.

గోదావరి జిల్లా ద్రాక్షారామం నేపథ్యంలో, గోదారి అందాలు, పచ్చదనాల మధ్య చిత్రీకరించిన పాటలో మామపై మేనల్లుడి ప్రేమను, అభిమానాన్ని, ఆరాధనను వెల్లడించేలా రామజోగయ్య శాస్త్రి గీతం రచించారు. థమన్ సంగీతం అందించారు. పాట మొత్తం మేనల్లుడి టోన్ లోనే సాగినా, మధ్యలో జాతర జోష్ ను చొప్పించారు. 

మరీ అద్భుతంగా లేదు కానీ, విజువల్స్ యాడ్ చేస్తే, బాగుండొచ్చు. ఇటీవల ప్రతి రోజూ పండగే సినిమా లో కూడా తాత మనవడు నేపథ్యంలో పాట వచ్చింది. అది కూడా గోదారి బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. వారం రోజుల గ్యాప్ లో వస్తున్న ఈ రెండు సినిమాల తొలి పాటలు నాలుగు రోజుల గ్యాప్ లో రావడం, వాటి మధ్య సిమిలారిటీస్ వుండడం కాస్త చిత్రమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?