ఒంటిపై టాటూలు వేయించుకోవడం ఇప్పుడు స్టయిల్. ఈ విషయంలో హీరోల కంటే హీరోయిన్లు ముందున్నారు. శరీరంలో చాలా భాగాల్లో టాటూలు వేయించుకున్న హీరోయిన్లు ఉన్నారు. అనసూయకు కూడా అలాంటి టాటూ ఉంది. తన మణికట్టుపై అనసూయ పచ్చబొట్టు వేయించుకుంది. అయితే దాని అర్థం ఏంటనేది చాలామందికి తెలియదు. అదేంటో అనసూయ స్వయంగా చెబుతోంది.
“బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పది అని చెప్పడానికి ఖేలన్ అనే పదం వాడతారు. గ్రీకు మైథాలజీలో ఖేలన్ అనే పదాన్ని అంతఃసౌందర్యం కోసం వాడతారు. నేను కూడా నాకు సంబంధించి అదే చెప్పాలనుకుంటాను. నా బాహ్య సౌందర్యం కంటే నా మనసు చూడమని కోరుకుంటాను. అందుకే ఖేలన్ అనే పదాన్ని టాటూగా వేయించుకున్నాను.”
తను డబ్బుల కోసం సినిమాలు చేయడం లేదని స్పష్టంచేసింది అనసూయ. తనకు టెలివిజన్ ఫీల్డ్ నుంచే డబ్బు వస్తోందని, కేవలం తనను వేరే యాంగిల్ లో చూపించడం కోసమే సినిమాలు చేస్తున్నట్టు స్పష్టంచేసింది,
“నన్ను చాలామంది లైట్ తీసుకున్నారు. టీవీల్లో ఎక్స్ పోజింగ్ తోనే నెట్టుకొచ్చానని అన్నారు. వాళ్లకు సినిమాతో సమాధానం ఇవ్వాలనుకున్నాను. సిల్వర్ స్క్రీన్ పై వేరే అనసూయను చూపించాలనుకున్నాను. ఈ విషయంలో క్షణం, రంగస్థలం సినిమాలు నాకు బాగా హెల్ప్ చేశాయి.”
తనకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేని టైమ్ లో చాలా ఆఫర్లు వచ్చాయని అంటోంది అనసూయ. చివరికి ఆర్య-2లో కూడా ఓ కీలక పాత్ర కోసం తనను సంప్రదించారని బయటపెట్టింది.