కాస్త ఎక్కువ గ్యాప్ తరువాతే నితిన్ చేస్తున్న సినిమా భీష్మ. దర్శకుడు వెంకీ కుడుముల తన తొలి సినిమా ఛలో తరువాత అందిస్తున్న సినిమా ఇది. కొత్త ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ అన్నట్లుగా, టీజర్ అనుకోవచ్చు అన్నట్లుగా ఓ విడియో వదిలారు.
దర్శకుడు త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా వదిలిన ఈ విడియో ఫక్కా గా ప్రతి ఒక్కరికీ నచ్చేలా కట్ చేసారు.
ఒక విధంగా టీజర్ అనిపించుకునే ఈ విడియోలో మూడు చమక్కులు వున్నాయి. ఒకటి యూత్ ఫుల్ రొమాంటిక్ మూమెంట్ ను క్యాచ్ చేయడం, రెండు ఈ మూమెంట్ కు మ్యాచ్ అయ్యే ఫంకీ మ్యూజిక్ ను అందించడం, ఇవన్నీ కలిపి నీట్ గా కట్ చేయడం. ఈ విషయంలో దర్శకుడు వెంకీ కుడుముల, మణిశర్మ తనయుడు సాగర్, ఎడిటర్ నవీన్ నూలి, ఈ ముగ్గురిని మెచ్చుకోవాలి.
రష్మిక చీరకట్టు సొగసు, నితిన్ అమాయకపు చూపులు, 'నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదేరా..కనిపిస్తుంది కానీ క్యాచ్ చేయలేం' అన్న డైలాగు, చివరిలో 'చించేసారు' అనే ఎక్స్ ప్రెషన్ రెండూ అదిరాయి.
మొత్తం మీద విడుదల చాలా దూరంలో వున్నా, ముందుగా విడుదల చేసిన ఈ భీష్మ విడియో మాత్రం బాగానే వైరల్ అవుతుంది.