హద్దు మీరి మాట్లాడటంలో, అనుచితంగా మాట్లాడటంలో నటి కంగనా రనౌత్ సోదరి రంగోళీ చాలానే ముందుకు వెళ్లి పోయింది. అనేక మంది బాలీవుడ్ ప్రముఖులపై ఆమె డీ గ్రేడ్ కామెంట్స్ చేశారు. అయినా జనాలు ఆమెను భరిస్తూ ఉన్నారు. సినిమా వాళ్లు ఆమెను పట్టించుకోవడం మానేశారు.
అయితే వారి వారి వ్యక్తిగత వ్యవహారాల్లోకి చొరబడి కంగనా సోదరి దారుణ కామెంట్లు చేస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో నటి మలైకా ఆరోరా షేర్ చేసిన ఒక ఫొటోపై నీఛ కామెంట్లు చేసింది రంగోళీ.
తన కొడుకు, తన పిక్ ఒకటి పోస్టు చేసింది మలైకా. అందులో మలైకా తనదైన శైలి డ్రస్సింగ్ లో ఉంటుంది. ఇది వరకూ కూడా అలాంటి ఫొటోలను మలైకా షేర్ చేసింది. జనాలు ఆ డ్రస్సింగ్ లను లైట్ తీసుకున్నారు.
అయితే కంగనా సోదరి తనకు సంబంధం లేని ఆ వ్యవహారంలోకి తలదూర్చింది. ఆ ఫొటోను షేర్ చేసి 'దిస్ ఈజ్ మోడ్రన్ ఇండియన్ మదర్.. వెరీగుడ్' అంటూ వ్యంగ్యం వ్యక్తం చేసింది. ఆ ఫొటోలో కంగనా సోదరి వల్గారిటీ చూసింది.
అయితే వేరే ఎవరైనా అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అదో లెక్క. అయితే కంగనా సోదరికి ఆ అర్హత ఎక్కడ ఉంటుంది? అవతల కంగనానేమో అందాలు ఆరేస్తూ ఉంటుది, బికినీల్లో శృంగారాన్ని ఒలకపోస్తూ ఉంటుంది. అలాంటి పిక్స్ పోస్టు చేస్తూ ఉంటుంది. అలాంటి హీరోయిన్ సోదరి వేరే వాళ్లకు నీతులు చెప్పడంపై నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు.
ఒక తల్లీకొడుకు పిక్ మీద అలాంటి కామెంట్ పెడతావా? అంటూ చెప్పుతో నిన్ను సత్కారం చేయాలంటూ.. కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇప్పటికే వల్గర్ కామెంట్స్ తో ఈ రంగోలీ వివాదాల పాలైంది. ఇప్పుడు వాటికే అలవాటు పడ్డట్టుగా వ్యవహరిస్తూ ఉందని పరిశీలకులు అంటున్నారు.