బిగ్ బాస్ నాకిచ్చింది చాలా తక్కువ

బిగ్ బాస్ హౌజ్ లో గడిపిన రోజుల్లో ప్రతి కంటెస్టెంట్ కు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసింది స్టార్ మా యాజమాన్యం. ఎలిమినేట్ అయినా అవ్వకపోయినా హౌజ్ లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్లకు పారితోషికం ఇచ్చింది.…

బిగ్ బాస్ హౌజ్ లో గడిపిన రోజుల్లో ప్రతి కంటెస్టెంట్ కు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసింది స్టార్ మా యాజమాన్యం. ఎలిమినేట్ అయినా అవ్వకపోయినా హౌజ్ లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్లకు పారితోషికం ఇచ్చింది. కొంతమందికి రోజుకు ఇంత అని, మరికొంతమందికి వారం లెక్కన పేమెంట్స్ చేసింది.

ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా శ్రీముఖి తీసుకుందనేది ఓ టాక్. ఆమెకు డెయిలీ పేమెంట్స్ ఇచ్చిందట ఛానెల్. అయితే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా నిలిచిన్ రాహుల్ కు మాత్రం డెయిల్ పేమెంట్స్ లేవు. తనకు వారానికి ఓసారి డబ్బు ఇచ్చేవారని, అది కూడా చాలా తక్కువగా ఇచ్చారని అంటున్నాడు రాహుల్.

“బిగ్ బాస్ కోసం నాకు ఎంతిచ్చారనేది నా పర్సనల్. అది బయటకు చెప్పలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను, అంతా అనుకుంటున్నట్టు నాకు లక్షల్లో పారితోషికం ఇవ్వలేదు. చాలా తక్కువ ఇచ్చారు. బయట ఓ కార్యక్రమం చేస్తే నాకు ఎంత వస్తుందో బిగ్ బాస్ హౌజ్ లో వారానికి అంత చొప్పున లెక్కగట్టి ఇచ్చారు. బయటకు చెప్పలేని మొత్తం అది.”

కేవలం పేమెంట్ విషయంలోనే కాదు, ప్రైజ్ మనీ విషయంలో కూడా రాహుల్ కు అన్యాయం జరిగింది. దేశంలో ఉన్న టాక్స్ విధానం ప్రకారం బహుమతులు, లాటరీ, ప్రైజ్ మనీగా సంపాదించిన మొత్తంపై టాక్స్ ఎక్కువగా ఉంది. అలా రాహుల్ సంపాదించిన 50లక్షల ప్రైజ్ మనీలో దాదాపు 15 లక్షలు టాక్స్ రూపంలో పోయిందంటున్నారు.

తన రెమ్యూనరేషన్ డబ్బు, ప్రైజ్ మనీ కలిపి ఉన్నంతలో ఓ సొంతిల్లు తీసుకుంటానంటున్నాడు రాహుల్. ఇన్నాళ్లూ అద్దె ఇంట్లో ఉన్నామని, ఇకపై సొంత ఇల్లు తీసుకుంటామని చెబుతున్నాడు. ఇంకా డబ్బు మిగిలితే సెలూన్ చెయిన్ ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నాడట ఈ సింగర్.