వెబ్ సిరీస్ బాటలో మరో హీరో

కొంతమంది హీరోలు వెబ్ సిరీసుల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటే.. మరికొంతమంది హీరోలు వెబ్ సిరీస్ లు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో నాని చేరాడు. తన సొంత బ్యానర్ పై…

కొంతమంది హీరోలు వెబ్ సిరీసుల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటే.. మరికొంతమంది హీరోలు వెబ్ సిరీస్ లు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో నాని చేరాడు. తన సొంత బ్యానర్ పై వెబ్ సిరీస్ నిర్మిస్తానంటున్నాడు ఈ హీరో.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై మూవీస్ నిర్మిస్తున్నాడు నాని. తొలి ప్రయత్నంగా “అ!” అనే సినిమా, మలి ప్రయత్నంగా “హిట్” అనే సినిమా ప్రొడ్యూస్ చేశాడు. ఇప్పుడీ బ్యానర్ పై మూడో ప్రయత్నంగా వెబ్ సిరీస్ నిర్మించబోతున్నాడు. అయితే ఇందులో తను నటిస్తాడా లేదా అనే విషయంపై నాని స్పష్టత ఇవ్వలేదు.

“నా సినిమా ఒకటి ఇలా డైరక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు V సినిమా రిలీజ్ అవుతోంది. సో.. ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నేను సినిమా ప్రేమికుడ్ని. 10-20 ఎపిసోడ్ల సిరీస్ లో నటించడం కంటే ఓ సినిమాలో నటించడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను.”

ఇక మరో అప్ కమింగ్ మూవీ “టక్ జగదీష్”పై స్పందిస్తూ.. అక్టోబర్ నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. 2021 ప్రథమార్థంలో ఆ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తామంటున్నాడు నాని.

బాబు వెన్నుపోటుకు 25 ఏళ్ళు