ప్రపంచానికంతటికీ 2020 అచ్చిరాని ఏడాదవుతోంది. ఎందుకంటే కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. దీంతో వ్యవస్థలే విధ్వంసమవుతున్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్లో పెళ్లి కాని ప్రసాద్లందరికీ 2020 ఎంతో కలి సొచ్చినట్టుంది. టాలీవుడ్ మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్‌గా ముద్దుగా పిలిపించుకుంటున్న రానా దగ్గుబాటి ఎట్టకేలకు ఇటీవల ఓ ఇంటి వాడయ్యారు.
అలాగే హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, నితిన్, సాహో డైరెక్టర్, తదితరులు వివాహ బంధంతో కరోనా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, హీరోయిన్ నిహారిక కూడా నిశ్చితార్థం పూర్తి చేసుకుని త్వరలో పెళ్లి పీఠలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. 'కృష్ణా అండ్ హిజ్ లీల' నటి షాలిని రెండు రోజుల క్రితం తమిళ దర్శకుడు మనోజ్‌తో ఏడడుగులు నడిచారు.
ఈ నేపథ్యంలో యువ హీరో శర్వానంద్ పెళ్లి గురించి ఓ తాజా సమాచారం చక్కర్లు కొడుతోంది. త్వరలో శర్వానంద్ కూడా ఓ ఇంటి వాడు కానున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తన చిన్ననాటి స్నేహితురాలు, మహిళా పారిశ్రామికవేత్తతో శర్వానంద్ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. శర్వానంద్ ప్రేమను పెద్దలు అంగీకరించడంతో పెళ్లికి ముహూర్తం ఖరారు చేయనున్నారనే సమా చారం ఆయన అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఈ విషయమై శర్వానంద్ క్లారిటీ ఇస్తే…అందులోని నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.