దండయాత్ర.. ఇది శ్రీరెడ్డి దండయాత్ర.
ఒకటి కాదు, రెండు కాదు.. పొద్దున్నుంచి మినిమం గ్యాప్ లో వరుసగా వీడియోలు. ప్రతి వీడియోలో మెగా కాంపౌండ్ పై విమర్శలు-విసుర్లు, తిట్లు-శాపనార్థాలు, బూతులు-అభాండాలు. మెగా కాంపౌండ్ అంటే శ్రీరెడ్డికి అస్సలు పడదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇంతలా ఆమె ఎప్పుడూ విరుచుకుపడలేదు. ఇంతకీ ఏమైంది?
శ్రీరెడ్డి ఉగ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణం బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే. అవును.. ఈ ఫినాలేకు చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అక్కడితో ఆగకుండా తమన్నా సింహాద్రిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, పరోక్షంగా శ్రీరెడ్డిపై విమర్శలు చేశారు. శ్రీరెడ్డి విషయంలో తమన్న సింహాద్రి తీసుకున్న తీసుకున్న స్టాండ్ ను గుర్తుచేస్తూ.. ఆ విషయం ఏంటనేది మనిద్దరికే తెలుసంటూ చిరంజీవి చెప్పడం శ్రీరెడ్డికి కోపం తెప్పించింది.
అంతే, ఈరోజు పొద్దున్నుంచి సోషల్ మీడియాలో వరుసగా వీడియోలు పెడుతూనే ఉంది. చిరంజీవి అన్న ఒక్క మాటకు అతడితో పాటు మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలందర్నీ ఉతికి ఆరేసింది శ్రీరెడ్డి. ఏమాత్రం మొహమాటపడకుండా, ముందూవెనకా ఆలోచించకుండా మధ్యమధ్యలో కొన్ని బూతులు కూడా మిక్స్ చేసి తిట్టేసింది. ఈ వీడియో చూశాక తనను తొక్కేస్తారని, చంపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ వ్యాఖ్యానించింది.
చిరంజీవి పరిశ్రమలో చేసిన కొన్ని పనుల్ని ప్రస్తావించిన శ్రీరెడ్డి, అతడి రాజకీయ జీవితాన్ని ఏకి పడేసింది. తనకు మా అసోసియేషన్ లో కార్డు రాకుండా చేసింది, బిగ్ బాస్ సీజన్3లో ఎంటర్ అవ్వకుండా చేసింది కూడా చిరంజీవే అని ఆరోపించింది శ్రీరెడ్డి.
ఇక్కడితో ఆగకుండా.. ఓ మనిషిని ఎలా తొక్కేయాలో తెలియాలంటే చిరంజీవి దగ్గర టీచింగ్ కు వెళ్లాలని విమర్శించింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా వీడియోలు పోస్టు చేస్తూనే ఉంది శ్రీరెడ్డి. ఈ వీడియో అస్త్రాలు రేపటివరకు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
చివరికి తన విమర్శల్లో సైరా సినిమాను కూడా వదల్లేదు. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో, ఎంత నష్టం వచ్చిందో అందరికీ తెలుసంటోంది. మొత్తం మెగా కాంపౌండ్ లో ఉపాసన మాత్రమే మంచి వ్యక్తి అని మిగతా వ్యక్తులందరికీ దొంగబుద్ధి అంటోంది శ్రీరెడ్డి.
కేవలం ఇమేజ్ వల్ల వాళ్ల అసలు బుద్ధి బయటకు రావడం లేదని ఆరోపించింది. ఇలా ఈరోజంతా మెగా కాంపౌండ్ ను తిట్టడానికే సమయం కేటాయించింది శ్రీరెడ్డి.