కన్నబాబుకు చిరు ఫోన్?

తమ్ముడు చేసిన డ్యామేజ్ కు అన్న సముదాయింపు తప్పదు వ్యవహారం ఇది. మంత్రి కన్నబాబు పై జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు కాపు సామాజిక వర్గంలోనే కాస్త దుమారం లేపాయి. Advertisement…

తమ్ముడు చేసిన డ్యామేజ్ కు అన్న సముదాయింపు తప్పదు వ్యవహారం ఇది. మంత్రి కన్నబాబు పై జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు కాపు సామాజిక వర్గంలోనే కాస్త దుమారం లేపాయి.

తరచు కన్నబాబును ఎందుకిలా పవన్ టార్గెట్ చేస్తున్నారన్న డిస్కషన్లు కాపు సామాజిక వర్గంలో వినిపిస్తున్నాయి.

తన అన్న పెట్టిన పార్టీలో చేరి, ఇంత లెవెల్ కు ఎదిగిపోవడం పవన్ జెలసీగా ఫీలవుతున్నారేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కూడా కన్నబాబును ఓడించాలని పవన్ తెగ ప్రయత్నించారు.

అది జరగలేదు కానీ పవన్ మాత్రం రెండు చోట్ల ఓడిపోయారు. దాంతో పవన్ కు కన్నబాబు మీద జెలసీ మరింత పెరిగిపోయి వుంటుంది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

కానీ మరోపక్క మెగాస్టార్ చిరంజీవి మాత్రం నేరుగా ఫోన్ చేసి, తమ్ముడు చేసిన కామెంట్లను సీరియస్ గా తీసుకోవద్దని, రాజకీయ విబేధం తప్ప  మరేం లేదని కన్నబాబుకు చెప్పినట్లు వదంతి వినిపిస్తోంది.

మొన్నటికి మొన్న సైరా సినిమా అదనపు ఆటల విషయంల చిరంజీవి కి కన్నబాబు మాట సాయం చేసారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఆ మధ్య కన్నబాబు కుటుంబానికి కష్టం వస్తే చిరంజీవి వెళ్లి పలకరించి వచ్చారు. ఇప్పటికీ కుటుంబ సభ్యుడు పోయిన బాధలోనే వుంది కన్నబాబు కుటుంబం.  ఆ సంగతి మెగాస్టార్ కు బాగా తెలుసు.

ఇలాంటి నేపథ్యంలో పవన్ వాఖ్యలు వాళ్లను మరింత బాధిస్తాయని గమనించి, ఆయనే ఫోన్ చేసి కన్నబాబుతో మాట్లాడినట్లు పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది.