ఇక నాని వంతు

గీత గోవిందం బ్లాక్ బస్టర్ తరువాత సినిమా ఎక్కడం అన్నది ఎవరెస్ట్ ఎక్కడంలా తయారైనట్లు కనిపిస్తోంది దర్శకుడు పరుశురామ్ కు. ఏ Advertisement పుట్టలో ఏ పాము వుందా అన్నట్లు, ఏ హీరో వెంటనే…

గీత గోవిందం బ్లాక్ బస్టర్ తరువాత సినిమా ఎక్కడం అన్నది ఎవరెస్ట్ ఎక్కడంలా తయారైనట్లు కనిపిస్తోంది దర్శకుడు పరుశురామ్ కు. ఏ

పుట్టలో ఏ పాము వుందా అన్నట్లు, ఏ హీరో వెంటనే డేట్ లు ఇస్తారా? అని అందరినీ ఒక రౌండ్ వేస్తూ వస్తున్నారు. గట్టిగా వారం కాలేదు. యువి వంశీ దగ్గరకు వెళ్లి కథ చెప్పి వచ్చి. ఇప్పుడు మరో హీరో దగ్గరకు వెళ్తున్నారు.

సరైన ప్రాజెక్టుల కోసం చూస్తున్న హీరో నాని దగ్గరకు పరుశురామ్ వెళ్తున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.  మహేష్ నుంచి యువి వంశీ వరకు చెప్పిన ఆ కథనే చెబుతారో? మరింకేదైనా కొత్త కథ చెబుతారో? కథ చెప్పిన తరువాత కానీ మనకు తెలియదు. 

అయితే నాని ఇప్పుడు వెంటనే చేసేయడానికి రెడీ గా లేరు. ఎందుకంటే శివనిర్వాణ సినిమా దాదాపు ఓకె చేసారు. దాదాపు అదే ఫైనల్ అవుతుందని బోగట్టా. అందువల్ల కథ నచ్చినా కనీసం ఆరునెలలు వెయిటింగ్ లోనే వుండాలి పరుశురామ్.

ఈ లోగా జనాలు గీత గోవిందం సక్సెస్ ను మరిచిపోయేలా వున్నారు . ఎందుకంటే ఆ సినిమా విడుదలై ఏడాదిన్నర అయింది మరి.