Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'లస్ట్ స్టోరీ'కి కోటిన్నర

'లస్ట్ స్టోరీ'కి కోటిన్నర

ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్స్ కు ఆదరణ పెరుగుతోంది. అమెజాన్ ప్రయిమ్ పుణ్యమా అని వెబ్ సిరీస్ లకు కూడా ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో తెలుగులో కూడా వెబ్ సిరీస్ ఇప్పటికే ట్రయ్ చేసారు. అయితే అంతగా క్లిక్ కాలేదు.

ఇలాంటి నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ లో క్లిక్ అయిన 'లస్ట్ స్టోరీస్' టైపు కాస్త ఎరోటిక్ టచ్ వున్న వెబ్ సిరీస్ ను తెలుగులో కూడా అందించే ప్రయత్నం జరుగుతోంది.

నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేసేందుకు ఓ సంస్థ అయిదారు లస్ట్ స్టోరీస్ ను తయారు చేయించే పనిలో పడింది. ఇందుకోసం కోటిన్నర ప్యాకేజ్ ను ఆఫర్ చేస్తోంది. అంటే ఒక ఎపిసోడ్ ను స్టార్ట్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్, ఆపై డైరక్టర్ రెమ్యూనిరేషన్ అన్నీ కలిపి కోటిన్నర అన్నమాట. 

ఇప్పటికే నందినీ రెడ్డి, సందీప్ వంగా లాంటి డైరక్టర్లు ఒక్కో ఎపిసోడ్ చేసి ఇవ్వడానికి ముందుకు వచ్చారని బోగట్టా. మరో ఇద్దరు ముగ్గురు డైరక్టర్లను సంప్రదించే పనిలో వున్నారు మేకర్లు. అందులో భాగంగానే డైరక్టర్ మారుతిని కూడా అడిగినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లో అనురాగ్ కాశ్యప్, కరణ్ జోహార్, జోయా అక్తర్ లాంటి ప్రముఖలు చేసారు. విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ నే వచ్చింది.

తెలుగు దర్శకులు కూడా మాంచి ఎమోషనల్ లస్ట్ స్టోరీస్ ను అందించి శభాష్ అనిపించుకుంటారేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?