'దేవసేన' అనుష్క ఆచి తూచి చేస్తున్న సినిమా నిశ్శబ్ధం. ఇదే విధంగా సినిమాలు చేసే మాధవన్ హీరో. కోనవెంకట్-పీపుల్స్ మీడియా భాగస్వామ్యం. మొదటి నుంచి ఈ సినిమా విశేషాలు అంతగా బయటకు రాలేదు.
ఇప్పటి వరకు వదలిన పబ్లిసిటీ మెటీరియల్ కూడా పెద్దగా రివీల్ చేసిందీ లేదు. సినిమా కథేంటీ? ఎలా వుండబోతోంది? ఏమిటి? అన్నది తెలియదు.
తొలిసారి ఇప్పడు తెలిసింది. అనుష్క బర్త్ డే సందర్భంగా టీజర్ వదలడంతో సినిమా ఎలా వుండబోతోందో ఓ అవగాహన వచ్చింది. భాగమతి మాదిరిగానే హర్రర్ టచ్ వున్న థ్రిల్లర్ గా వుండబోతోందని అర్థం అవుతోంది.
చూడరానిది చూసో, జరగరానిది జరిగో మూగగా మారిపోయిన అమ్మాయి, కేవలం సైగల సాయంతో వివరించిన విషయాల ఆధారంగా జరిగే పరిశోధన టీజర్ లో కనిపించింది.
అమెరికా నేపథ్యం కావడంతో టీజర్ లో ఆ కొత్తదనం కనిపించింది. టీజర్ కు ఇచ్చిన ఆర్ఆర్ ఇంప్రెసివ్ గా, ఇంట్రస్టింగ్ గా వుంది. నిశ్శబ్దం సినిమాకు దర్శకుడు హేమంత్ మధుకర్.