నోటి దూల అయ్య‌న్న అరెస్ట్!

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న పాత్రుడును విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకొని విశాఖకు వ‌స్తున్న ఆయ‌న్ను పోలీసులు అదుపులో తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.…

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న పాత్రుడును విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకొని విశాఖకు వ‌స్తున్న ఆయ‌న్ను పోలీసులు అదుపులో తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త వారం లోకేష్ స‌భలో.. సీఎం, మంత్రుల‌పై దూషించిన కేసులో అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఏడు ప‌దుల వ‌య‌సుకు చేరువ అవుతున్న ఈ సీనియ‌ర్ నేత టీడీపీకి అధికారం దూరం అయిన‌ప్ప‌టి నుండి నోటీకి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతూనే ఉన్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు.. మంత్రులు.. సీఎం అనీ తేడా లేకుండా నోటీకి వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం పోలీసు కేసులు అయితే కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవ‌డం ఆయ‌న‌కు కామ‌న్ అయిపోయింది.

నేను ఎంత మాట్లాడిన.. ఎలా మాట్లాడినా నన్ను టచ్ చేసి వాడే లేడు అన్నట్లు వీర్రవీగుతూ మీడియా మైక్‌ కనపడగానే రెచ్చిపోతున్నారు. తాజా అరెస్టు తర్వాత అయినా కూడా ఆయ‌నో మార్పు వస్తుందని అనుకోవడం అవివేకమే అవుతుంది. ఎందుకంటే బరితెగించిన వారికి అడ్డు అదుపు అనేది లేదు అనే సంగతి అందరికీ తెలిసిందే.