మూడు సినిమాలకు ఒకటే తలనొప్పి

సినిమాల మేకింగ్ అలాగే వుంటుంది. ఎంత దూరంగా విడుదల డేట్ వేస్తే అంతకు అంతా ఆలస్యం అవుతూనే వుంటుంది. పండగ సినిమాలు మూడింటి పరిస్థితి ఇదే. అక్టోబర్ కు రావాల్సిన సినిమా వీర నరసింహారెడ్డి.…

సినిమాల మేకింగ్ అలాగే వుంటుంది. ఎంత దూరంగా విడుదల డేట్ వేస్తే అంతకు అంతా ఆలస్యం అవుతూనే వుంటుంది. పండగ సినిమాలు మూడింటి పరిస్థితి ఇదే. అక్టోబర్ కు రావాల్సిన సినిమా వీర నరసింహారెడ్డి. కానీ సంక్రాంతికి వస్తోంది. కేవలం ఎంతకూ సినిమా ఫినిష్ చేయలేకపోవడమే. అలా అని నిర్మాతల సమస్య లేదు. హీరో సమస్య అంతకన్నా కాదు. ఎక్కడ సమస్య అన్నది వారికే తెలియాలి. 12న విడుదల అంటే 7వ తేదీ నాటికి ఇంకా ఆర్ఆర్ వర్క్ అవుతోంది అంటే ఎంత లేట్ అన్నది ఆలోచించుకోవచ్చు.

ఒకపక్క వారసుడు సినిమాకు ఆర్ఆర్ చేస్తూనే మరోపక్క వీర సింహారెడ్డి సినిమాకు ఆర్ఆర్ చేస్తున్నారు థమన్. ఓ క్రియేటివ్ టెక్నీషియన్ కు ఇది ఎంత ఇబ్బందికర పరిస్థితి అన్నది ఆలోచిస్తే దారుణంగా వుంటుంది. వీరసింహారెడ్డి ఫైనల్ కాపీని లాక్ చేయడంలో ఆలస్యం జరిగింది. ఆర్ఆర్ కు కాపీ చాలా ఆలస్యంగా ఇచ్చారు. దాంతో ఈ పరిస్థితి తలెత్తింది అని తెలుస్తోంది. 

ఆర్ఆర్ కావాలి. మిక్సింగ్, క్యూబ్ చెకింగ్..లోడింగ్..అన్నీ అయ్యాక ఓవర్ సీస్ లో మళ్లీ డౌన్ లోడ్ చేసి, హార్డ్ డిస్క్ లు రెడీ చేసి అన్ని ఏరియాలకు పంపాలి. అక్కడ ప్రీమియర్లు అంటే మనకు 11 రాత్రి కే అన్నమాట. ఈ డెడ్ లైన్ ను ఎలా మీట్ అవుతారో చూడాలి. ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏమిటంటే ఇప్పటి వరకు వీర సింహారెడ్డి ఇంకా సెన్సారు కూడా కాలేదు. సెన్సారు కాకుండా మల్టీ ఫ్లెక్స్ లు బుకింగ్ లు ఓపెన్ చేయవు.

విజయ్ వారసుడు పరిస్థితి ఇదే. నిన్నటి నుంచి వాయిదా పడిపోయింది. 13 కు వెళ్లిపోయింది. కాదు 14 అంటూ ఒకటే గ్యాసిప్ లు. ఎట్టి పరిస్థితుల్లోనూ 11న విడుదల చేస్తాం అని నిర్మాత దిల్ రాజు స్పష్టంగా చెబుతున్నారు.అది ఎలా సాధ్యం అన్నది చూడాలి. ఈ సినిమా సంక్రాంతికే అని చాలా ముందుగా ఫిక్స్ అయ్యారు. కానీ ఆ టార్గెట్ ను రీచ్ కావడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఫెయిలయినట్లే. గిల్డ్ సమ్మె వల్ల వీర సింహారెడ్డి కి, వాల్తేర్ వీరయ్య కు సమస్యలు వచ్చాయి  తప్ప, వారసుడుకు ఏ సమస్యా లేదు. అయినా రెడీ కాలేదు.

పై రెండింటితో పోల్చుకుంటే వాల్తేర్ వీరయ్య సేఫ్ జోన్ లో వుంది. నిన్నటికి నిన్న సిజిలు, మిక్సింగ్ చెకింగ్ లు జరిగిపోయాయి. ఈ రోజు క్యూబ్ కు లోడ్ చేస్తున్నారు. పైగా వాల్తేర్ వీరయ్య పై రెండు సినిమాల కన్నా ఓ రోజు ఆలస్యంగా విడుదలవుతోంది. అందువల్ల దీనికి ఏ టెన్షన్ లేదు. కానీ ఎటొచ్చీ టీమ్ ఎటువంటి ప్రమోషన్లలో పాల్గొనే అవకాశం లేదు. ముందుగా చేసుకున్న ప్రీ రికార్డెడ్ వీడియోలు వదులుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు.