చకచకా సినిమాలు చేస్తున్న సీనియర్ హీరోలు ఇద్దరే. చిరంజీవి. బాలకృష్ణ. ఇద్దరి సినిమాలు పండగకు విడుదలవుతున్నాయి. ఇద్దరి చేతలో మరో సినిమా రెడీగా వుంది. ఈయన మెహర్ రమేష్ సినిమా చేయాలి. ఆయన అనిల్ రావిపూడి సినిమా చేయాలి.
ఇవి కాక ఇద్దరికీ లైన్ లో చాలా సినిమాల డిస్కషన్లు వున్నాయి. బాలయ్య-బోయపాటి సినిమా కచ్చితంగా 2023లో వుంటుందని వార్తలు వున్నాయి. అవి అలా వుండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
మైత్రీ మూవీస్ లో భాగస్వామిగా వుంటూ, బయటకు వచ్చి స్వంత బ్యానర్ స్టార్ట్ చేసిన సివి మోహన్ కు ఓ సినిమా చేయడానికి బాలయ్య ఓకె అన్నారని తెలుస్తోంది. బింబిసార సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వేణు/వశిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ మేరకు వేణు చెప్పిన పాయింట్ ను బాలయ్య ఓకె చేసారని తెలుస్తోంది.
అయితే బోయపాటి సినిమాకు ముందు ఇది వుంటుందా? తరువాత? అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. మల్లిడి వేణు గీతా సంస్థకు కూడా ఓ సినిమా చేయాల్సి వుంది. అలాగే బింబిసార సీక్వెల్ కూడా చేయాలి.