సగటు కుర్రాడి సినిమా

ఫక్తు సాదా సీదా కుర్రాడి కథ ఎలా వుంటుంది. అందులోనూ తెలుగు సినిమాల్లో. అచ్చంగా అలాగే వుండేలా కనిపిస్తోంది నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా చేస్తున్న 'చూసీ చూడంగానే'. సినిమా…

ఫక్తు సాదా సీదా కుర్రాడి కథ ఎలా వుంటుంది. అందులోనూ తెలుగు సినిమాల్లో. అచ్చంగా అలాగే వుండేలా కనిపిస్తోంది నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా చేస్తున్న 'చూసీ చూడంగానే'. సినిమా టైటిల్ వర్డ్ ఎంత పాపులర్ నో టీజర్ కూడా అంతటి పాపులర్ సీన్లతోనే నిండినట్లు కనిపిస్తోంది.

అమ్మనాన్న మాట వినని కుర్రాడు. ఏదో చేయాలన్న తపన, ఇష్టం లేని చదువు, ఆపై అనుకోని ప్రేమ, అవాంతరాలు, ఇలా ఇదే సిరీస్ గా నిండాయి టీజర్ లో.

తొలిసినిమాగా శివ కందుకూరి టీజర్ లో బాగానే వున్నాడు. బాగానే కనిపించాడు. వినిపించాడు కూడా. కేవలం టీజర్ ను ఇంత వరకే తీసుకోవాలి. సినిమా వస్తే తప్ప కొత్త దర్శకుడు శేష సింధు ఏ మేరకు కొత్త దనం చొప్పించాడు అన్నది తెలియదు.

వర్ష హీరోయిన్. గోపీసుందర్ సంగీతం. సీనియర్ గేయరచయితలు సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్ లాంటి వాళ్లు పాటలు అందించారు. అందువల్ల మంచి పాటలు వస్తాయని ఆశించవచ్చు.

ఫోటోలు బాగా కనిపించాలంటే ఫొటోషాప్ లో విజయ్ దేవరకొండ ఫొటో పెట్టాలా? పాత డబ్బింగ్ సినిమా హీరొయిన్లలా వున్నారు..ఇలాంటి డైలాగులు దర్శకుడి సెన్సాఫ్ హ్యూమర్ ను వినిపిస్తున్నాయి. అందువల్ల యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా సినిమా తయారు చేస్తున్నారనే అనుకోవాలి.