cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

రఫ్..,రా..రెబల్..మీసం

రఫ్..,రా..రెబల్..మీసం

తన స్టయిల్ లో తను అనుకున్నట్లు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు హీరో శ్రీ విష్ణు.  గతంలో తనతో రెండు సినిమాలు చేసిన విజయ్ డైరక్షన్ లో అందిస్తున్న మరో సినిమా 'తిప్పరా మీసం'. ఈ సినిమా విడుదల ఈ వారమే. ఈ టైమ్ లో ట్రయిలర్ ను విడుదల చేసారు. 

అసలు తిప్పరా మీసం అనే టైటిల్, సినిమా స్టిల్స్ వగైరా చూస్తుంటేనే అంతా నాన్ సింక్ గా వుంది అనుకుంటే, ఇప్పుడు ట్రయిలర్ వచ్చి మరి కాస్త సస్సెన్స్ క్రియేట్ చేసింది. తల్లిని ఏ కారణంగానో, అకారణంగానో ద్వేషించే కొడుకుగా శ్రీవిష్ణు ట్రయిలర్ లో కనిపిస్తున్నాడు. అంతే కాదు, కేర్ నాట్ క్యారెక్టర్ మాదిరిగా వుంది అతని పాత్ర. 

ఈ మధ్య తెలుగులో కూడా కాస్త రఫ్, రగ్డ్..రెబల్ సినిమాలు చూడడం అలవాటు అవుతోంది. థాంక్స్ టు అర్జున్ రెడ్డి. అందుకే, ఆ ధైర్యంతోనే తిప్పరామీసం సినిమా కూడా కాస్త రఫ్ గా, రెబల్ గా, వుండేలా కనిపిస్తోంది. తల్లిగా రోహిణి కొడుకుగా శ్రీవిష్ణు క్యారెక్టర్లు మాత్రమే రివీల్ చేసారు. ట్రయిలర్ కు ఇచ్చిన నేపథ్య సంగీతం మీద కూడా అర్జున్ రెడ్డి ప్రభావం కనిపిస్తోంది. 

దారితప్పిన కుర్రాడు ఎలా మీసం తిప్పాడు అన్నది కాన్సెప్ట్ కావచ్చు. ప్రస్తుతానికి అయితే ట్రయిలర్ లో అదేమీ అంతగా చూపించలేదు. జస్ట్ ఓ విధంగా చెప్పాలంటే క్యారెక్టర్ ను పరిచయం చేసారంతే.