నట వారసత్వాలు మూడవ తరానికి కూడా పాకడం మనకి ఎప్పటినుంచో తెలుసు. తాజాగా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య (అమితాబ్ కూతురు కొడుకు) షారుఖ్ ఖాన్ కూతురు సుహానా కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. జోయా అఖ్తర్ దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమా టైటిల్ “ద ఆర్చీస్”. అయితే సుహాన, అగస్త్యల ప్రేమ సినిమాకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా కూడా గుబాళిస్తోందట. ఏది ఏమైనా అగస్త్య తల్లిదండ్రులకి షారుఖ్ కూతురంటే ఇష్టమేనట.
మనసు బాలీవుడ్డైనా మనీ టాలీవుడ్లో ఉంది
కరణ్ జోహార్ ఈ మధ్యన తెలుగు సినిమాపై దృష్టి ఎక్కువగా సారిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారణమేంటని అడిగితే తన మనసు బాలీవుడ్ సినిమాపైనే ఉన్నా కూడా ప్రస్తుతం తెలుగు సినిమారంగంలోనే డబ్బు ఎక్కువుందని చెప్పాడు. అందుకే టాలీవూడ్ పై తన దృష్టి ఉంటుందన్నాడు. అయితే తాజాగా హిందీలో రణ్వీర్ సింగ్ తో “రాకీ ఔర్ రాణి కి ప్రేం కహాని” అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు కరణ్.
భారతదేశంలో నేడు 90000 స్టార్టప్స్!
2016లో 1000 స్టార్టప్స్ తో మొదలైన భాతదేశం నేడు 90000 స్టార్టప్స్ తో దూసుకుపోతోంది. ఈ విషయాన్ని ఇంఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నీలకని చెప్పారు. దేశంలో సృజనాత్మకతకి, యువతలో ఎంటెర్ప్రెన్యూర్షిప్ విప్లవానికి ఈ గణాంకాలు తార్కాణం.
రష్మిక తన లెక్కలు మారుతున్నాయంటోంది
సందీప్ వంగా దర్శకత్వంలో రష్మిక, రణ్బీర్ కపూర్ జంటగా “ఏనిమల్” అనే సినిమా వస్తున్న సంగతి తెలుసిందే. ఈ సందర్భంగా రష్మిక ఒక విషయం చెప్పింది. ఇకపై తాను నటించబోయే విధానమే మారబోతోందట. అంతే కాదు, తాను చేయబోయే సినిమాల ఎంపిక విషయంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయట. తన మీద సందీప్ వంగా, రణ్బీర్, అనీల్ కపూర్ ల ప్రభావం పడిందని చెబుతోంది.
ప్రపంచంలోనే ఖరీదైన పిల్లిపిల్ల
ఇంట్లో కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకోవడం ప్రపంచమంతా కామన్. ఆయా బ్రీడ్స్ ని బట్టి వాటి ధరలు పలుకుతుంటాయి. అయితే ప్రపంచంలోకెల్లా ధనికులైన పిల్లిపిల్లలు ఎక్కడున్నాయో తెలుసా? అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ కి చెందిన ఓలీవియా బెన్సన్ ఆస్తి అక్షరాలా 800 కోట్ల రూపాయలు. అలాగే నాల క్యాట్ అనబడే మరొక పిల్లి ఆస్తి దాదాపు 830 కోట్ల రూపాయలట. ఇక ప్రపంచంలో కెల్లా రిచ్ కుక్క ఆస్తి 4000 కోట్ల రూపాయలంటే నమ్ముతారా? దాని పేరు గంటర్ సిక్స్. కొందరు శునక, మార్జాల ప్రేమికులు పిల్లలకు రాసినట్టు పెంపుడు జంతువులకి కూడా ఆస్తులు రాస్తుంటారు. ఆ బాపతులో ఇలా కుక్కలు, పిల్లులు మనుషులకంటే రిచ్ అవుతుంటాయి.