పవన్ ఫ్యాన్స్ కు ముందే దీపావళి

ఏ హీరో ఫ్యాన్స్ కు అయినా ఏం కావాలి? తమ హీరో సినిమాల నుంచి మాంచి అప్ డేట్. ఆ విషయంలో భీమ్లానాయక్ యూనిట్ చాలా స్పీడ్ గా వుంది.  Advertisement ఇప్పటికే వదిలిన…

ఏ హీరో ఫ్యాన్స్ కు అయినా ఏం కావాలి? తమ హీరో సినిమాల నుంచి మాంచి అప్ డేట్. ఆ విషయంలో భీమ్లానాయక్ యూనిట్ చాలా స్పీడ్ గా వుంది. 

ఇప్పటికే వదిలిన మెటీరియల్ అంతా క్రేజీగా వుంది. లేటెస్ట్ గా దీపావళి సందర్భంగా మరో వీడియో బ్లాస్ట్ చేసారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న యాక్షన్ ఎపిసోడ్ లో కనిపిస్తూ, చిన్న డైలాగు వేసారు. 'నాగరాజు గారూ మీకు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండీ. మీకు దీపావళి ముందుగానే వచ్చేసిందండీ' అనే డైలాగు కచ్చితంగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. 

వీడియో గ్లింప్స్ భారీ బ్లాస్ట్ తో ముగించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై నాగవంశీ నిర్మించే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. సాగర్ దర్శకుడు.