ప్రపంచవ్యాప్తంగా గతేడాది రిలీజైన సినిమాల్లో అత్యథిక వసూళ్లు సాధించిన సినిమా ఏది? ఈ ప్రశ్నపై క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ లో రిలీజైన అవతార్: ది వే ఆఫ్ వాటర్ మూవీ 2022లో అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
మొన్నటివరకు 2022 నంబర్ వన్ మూవీగా టాప్ గన్: మేవరిక్ ఉండేది. ఇప్పుడా స్థానాన్ని అవతార్-2 అధిగమించింది. విడుదలైన 3 వారాల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 1.516 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12,505 కోట్లు) వసూళ్లు వచ్చాయి. టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ కు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 11,548 కోట్లు) వచ్చాయి.
అవతార్: ది వే ఆఫ్ వాటర్ మూవీ రిలీజైనప్పట్నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. అత్యంత వేగంగా బిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. టాప్ గన్ సినిమాకు ఈ ఘనత సాధించడానికి 31 రోజులు పడితే, అవతార్-2 సినిమా కేవలం 2 వారాల్లో ఈ ఘటన సాధించింది.
అయితే భారీగా వసూళ్లు వస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా హిట్ అయినప్పటికీ, అవతార్-2 సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్లలేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే, 2 బిలియన్ డాలర్ల వసూళ్లు రావాలి.