ఇటీవల హీరో నాని సినిమాలు అంతగా హిట్ కాలేదు. అటు వి సినిమా అయినా ఇటు టక్ జగదీష్ అయినా ఆన్ లైన్ లో వచ్చి కూడా యావరేజ్ అయిపోయాయి.
అంతకు ముందు కృష్ణార్జున యుద్దం, దేవ్ దాస్, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు వుండనే వున్నాయి. జెర్సీ కి పేరు వచ్చింది కానీ కొందరు బయ్యర్లకు లాస్ నే. ఇలాంటి నేపథ్యంలో శ్యామ్ సింగ రాయ్ లాంటి భారీ సినిమా వస్తోంది.
సుమారు యాభై కోట్లకు ఫైగా వ్యయంతో తయారవుతున్న సినిమా ఇది. ఇంత అమౌంట్ రికవరీ అంటే అంత సులువు కాదు.
అందుకే ఆంధ్ర ఏరియాను 12 కోట్ల రేషియోలో, సీడెడ్ కు అయిదు కోట్ల రేషియోలో అమ్మాలని చూస్తున్నారు. కానీ బయ్యర్లు ముందు వెనుక ఆడుతున్నట్లు తెలుస్తోంది. హోల్ సేల్ గా లక్ష్మణ్ కొంటున్నారు అని వార్తలు వచ్చాయి కానీ అవి కార్యరూపం దాల్చలేదు.
సినిమా డిజిటల్ రైట్స్ నెట్ ఫిక్స్ కు విక్రయించారు. ఇక హిందీ డబ్బింగ్, శాటిలైట్ కావాల్సి వుంది. థియేటర్, నాన్ థియేటర్ కలిపి టోటల్ గా యాభై రెండు కోట్లకు పైగా రికవరీ రావాల్సి వుంది.
డిసెంబర్ 24న సినిమా విడుదల షెడ్యూలు చేసారు. అయితే దానికి ముందు వారమే డిసెంబర్ 17న బన్నీ పుష్ప సినిమా విడుదల వుంది. జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదల వుంది.