కురుప్…డిఫరెంట్ వన్

మన సినిమాలు..మన మాస్ వ్యవహారాలు వేరు. మలయాళ జనాల ఆలోచనలు వేరు. ఇది చాలా సార్లు రుజువు అవుతూనే వుంది. లేటెస్ట్ గా వచ్చిన ఓ ట్రయిలర్ కూడా మలయాళ సినిమా మేకర్ల వెర్సటాలిటీని…

మన సినిమాలు..మన మాస్ వ్యవహారాలు వేరు. మలయాళ జనాల ఆలోచనలు వేరు. ఇది చాలా సార్లు రుజువు అవుతూనే వుంది. లేటెస్ట్ గా వచ్చిన ఓ ట్రయిలర్ కూడా మలయాళ సినిమా మేకర్ల వెర్సటాలిటీని చూపించింది.

దుల్కర్ సల్మాన్ నటించిన కురుప్ సినిమా ట్రయిలర్ ఇది. ఇందులో ఓ మోస్ట్ వాంటెడ్ మోసగాడుగా దుల్కర్ రకరకాల వేరియేషన్లలో కనిపించాడు.

ఓ జరిగిన క్రయిమ్ ఆధారంగా తయారుచేసిన కథతో ఈ సినిమా తీసారు. తనలాగే వున్న వ్యక్తిని చంపేసి, భీమా సొమ్ము కొట్టేసే వ్యవహారం నేపథ్యంలో అల్లిన కథ ఇది. చాలా ఇంట్రస్టింగ్ గా కట్ చేసారు ట్రయిలర్ ను. 

సహజంగానే మంచి నటుడు అయిన దుల్కర్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడం, దేశంలోని డిఫరెంట్ లోకేషన్లు, ఛేజింగ్ సీన్లు ఆకట్టుకునేలా వున్నాయి.

శోభిత ధూళిపాల నటించిన ఈ సినిమా 12న విడుదల అవుతోంది.