‘పెద్దన్న’ సూపర్ స్టార్ సినిమా – డైరెక్టర్ శివ

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ నాలుగున రాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఆసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్…

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ నాలుగున రాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఆసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శివ సినిమా విశేషాలను పంచుకున్నారు.. 

చాలా ఎగ్జైటింగ్

– చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఫస్ట్ టైం సూపర్ స్టార్ రజినీకాంత్‌ తో పని చేశాను. సన్ పిక్చర్స్, సురేష్ బాబు వంటి వారితో పని చేశాను. సినిమా షూటింగ్ అంతా కూడా ఎంతో సరదాగా గడచింది. ఇక సినిమా విడుదల అవుతోందని ఎంతో సంతోషంగా ఉంది.

అలా మొదలైంది

– నేను డైరెక్ట్ చేసిన విశ్వాసం సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అప్పుడు రజినీ కాంత్ పిలిచారు.  నాతో ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్నావ్? అని రజినీకాంత్ అడిగారు. సూపర్ స్టార్ లాంటి సినిమా చేయాలని అనుకుంటున్నానని చెప్పాను. సూపర్ స్టార్ సినిమా అంటే ఏంటి? అని నవ్వుతూ అడిగారు. అన్ని రకాల ఎమోషన్స్‌తో కమర్షియల్‌గా ఉంటే అది సూపర్ స్టార్ సినిమా అని చెప్పాను. సరే అలాంటిదే చేద్దాం అన్నారు. ఫస్ట్ నెరేషన్‌లోనే కథ బాగా నచ్చింది. అలా సినిమా మొదలైంది. సన్ పిక్చర్స్, కళానిధి మారన్, కావ్యా మేడంలతో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మీద వారికున్న నమ్మకమే నన్ను నడిపించింది. చాలా రోజుల తరువాత మళ్లీ ఫుల్ ఫిల్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది.

రజనీ ప్రోత్సాహం?

– షూటింగ్ అంతా కూడా సరదాగానే జరుగుతూ ఉంటుంది. మంచి సీన్లు చేస్తే.. అందరి ముందే ప్రశంసించేవారు. సినిమా బాగా తీస్తున్నానని అన్నారు. అయితే కొంత సినిమాను ఎడిట్ చేసి చూపించాను. తన  సినిమా చూసినట్టు అనిపిస్తోందని రజినీకాంత్ అన్నారు. ఆ తరువాత సినిమా మొత్తం చూశారు. బయటకు వచ్చి హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. అది నేను ఎప్పటికీ మరిచిపోను. ఎంతో సంతృప్తితో ఆయన అలా చేశారు. అదే నాకు అతి పెద్ద ప్రశంస.

బోలెడుమంది నటులు

– ఈ చిత్రంలో చాలా మంది యాక్ట‌ర్స్‌ ఉన్నారు. చెప్పుకుంటూ వెళ్తే అలా పెద్ద కాస్టింగ్ ఉంటుంది. నయనతార, మీనా, కుష్బూ, జగపతి బాబు ఇలా చాలా మంది ఉన్నారు. అన్ని పాత్రలు చాలా బాగా వచ్చాయి.  నాకు  సినిమా అంటే సెలెబ్రేషన్స్. సందడిగా ఉండాలనే అలా తీస్తాను. పండుగకు అందరూ సినిమాకు వెళ్తున్నామంటే.. అలాంటి సినిమానే తీయాలి. మాది ఉమ్మడి కుటుంబం. పెద్ద వాళ్ల నుంచి చిన్న వాళ్ల వరకు అందరూ వెళ్లేవాళ్లం. అలాంటి సినిమాను ఇప్పుడు తీయడం నాకు చాలా ఆనందంగా ఉంది. కుష్బూ, మీనా కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం సంతోషంగా అనిపించింది. సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ వైబ్స్ వచ్చాయి.

న‌య‌న‌తార రోల్ ?

– చంద్రముఖి సినిమా నుంచి రజనీ-నయన్ కాంబినేషన్ బాగుంది. విశ్వాసం సినిమాలో నయనతార అద్భుతంగా నటించారు. రజినీకాంత్ , నయనతార, నేను కలిసి చేస్తే బాగుంటుందని అనుకున్నాను. నయన్ గారు నాకు మంచి ఫ్రెండ్. ఆమె కథ చెప్పగానే ఓకే చెప్పారు. 

పెద్దన్నలో రజనీకాంత్ 

– అభిమానులు రజినీకాంత్ ని ఎలా చూడాలని అనుకుంటున్నారో.. అలా ఉంటారు. ఆయన్నుంచి కోరుకునే మాస్, యాక్షన్ అన్నీ రకాలుగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేలానే కనిపిస్తారు.