గుణశేఖర్ ఈసారి ఏం చేస్తారో?

దర్శకుడు గుణశేఖర్ ది ఓ విభిన్న ఆలోచనా విధానం. నలుగురు నడిచిన బాట నడిచే దర్శకుడు కారు. తన ఆలోచన తనదే. కళ్ల ముందు విజువల్ వండర్ ను ఆవిష్కరించాలనుకుంటారు. కానీ ఎక్కడ మిస్…

దర్శకుడు గుణశేఖర్ ది ఓ విభిన్న ఆలోచనా విధానం. నలుగురు నడిచిన బాట నడిచే దర్శకుడు కారు. తన ఆలోచన తనదే. కళ్ల ముందు విజువల్ వండర్ ను ఆవిష్కరించాలనుకుంటారు. కానీ ఎక్కడ మిస్ ఫైర్ అవుతుంటుంది. మృగరాజు..సైనికుడు..వరుడు ఇలా మిస్ ఫైర్ అయినవే. రుద్రమదేవి ఏదో విధంగా పాస్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఇంత గ్యాప్ తరువాత శాకుంతలం సినిమాతో వస్తున్నారు.

చిన్నప్పటి నుంచి తెలుగు పాఠాల్లో చదువుకున్న కథ. దుష్యంతుడు అనే రాజు..అడవికి వెళ్లాడు. అక్కడ శాకుంతలముల చేత పెంచబడిన శాకుంతలను చూసి మోహించాడు. గాంధర్వ వివాహం చేసుకుని, ఉంగరం చేతిలో పెట్టి చక్కాబోయాడు. ఆ ఉంగరం కాస్తా పోయింది. మొహం గుర్తు లేదు ఉంగరం తప్ప. అంతో నువ్వెవరో తెలియదన్నాడు. తరువాత మొత్తానికి కథ సుఖాంతమైంది. వారికి పుట్టిన వాడే భరతుడు. అలా వచ్చిందే భారత దేశం.

ఈ కథకు ఎమోషన్లు, రొమాన్స్ యాడ్ చేయగలరేమో కానీ పురాణ కథను పక్కదారి అయితే పట్టించలేరు. ఇక మిగిలినంతా విజువల్ గ్రాండియర్ మాత్రమే. అక్కడ మనకు ఎంత కావాలంటే అంతా చేసుకోవచ్చు. అసలు గుణశేఖర్ టార్గెట్ కూడా ఇదే. అందుకే త్రీడీ లో సినిమా తీయడం. కానీ ఒకటే సమస్య. బాహుబలి..ఆర్ఆర్ఆర్..అవతార్ లు చూసేసిన వారికి అంతకు మించి  చూపించాల్సి వుంటుంది.

అలా కాకపోతే ఈ పుక్కింటి పురాణకథను జనం ఎంజాయ్ చేయడం కష్టం. పోనీ మాంచి రొమాన్స్..ఫీల్ గుడ్ లవ్..యాడ్ చేయాలి..మాంచి పాటలు వుండాలి. మనకు తెలిసిన హీరో హీరోయిన్లు వుండాలి. వాళ్ల మధ్య కెమిస్ట్రీ పండాలి. కానీ ఇక్కడ మనకు పరిచయం వున్నది సమంత మాత్రమే. ఇప్పటి వరకు పాటలు బయటకు రాలేదు కనుక వేచి చూడాలి.

మొత్తం మీద గుణశేఖర్ ఏం చేస్తారో ఈసారి అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో ఇంతో అంతో వుంది కానీ ఇంకా జనాల్లో మాత్రం కలగడం లేదు. దానికి ఇంకా చాలా టైమ్ వుందేమో?