రాజమౌళి వల్ల నలుగురు ఇరుక్కుపోయారు

ఆర్.ఆర్.ఆర్. చిత్రం పూర్తి కావడానికి మరో ఏడాది పైగా పడుతుందని అంటున్నారు. మళ్లీ షూటింగ్స్ మొదలవడానికి డిసెంబర్ వరకు ఎదురు చూడాల్సి వుంటుందని, అప్పట్నుంచి ఒక ఏడెనిమిది నెలల పాటయినా షూటింగ్ జరుగుతుందని, మారిన…

ఆర్.ఆర్.ఆర్. చిత్రం పూర్తి కావడానికి మరో ఏడాది పైగా పడుతుందని అంటున్నారు. మళ్లీ షూటింగ్స్ మొదలవడానికి డిసెంబర్ వరకు ఎదురు చూడాల్సి వుంటుందని, అప్పట్నుంచి ఒక ఏడెనిమిది నెలల పాటయినా షూటింగ్ జరుగుతుందని, మారిన షెడ్యూల్స్ ప్రకారం మళ్లీ ఆర్టిస్టుల డేట్స్ సంపాదించడం, అందరినీ, అన్నిటినీ ఒక ట్రాక్‌పైకి తీసుకురావడం లాంటి తలనొప్పులుంటాయని అంచనా వేస్తున్నారు.

దీంతో మరో ఏడాది పాటు ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ‘ఆర్.ఆర్.ఆర్’కే కట్టుబడి వుండాల్సి వస్తుంది. వీళ్లపై ఏడాదికి కనీసం రెండొందల కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది. ఇదిలావుంటే ఈ హీరోల కారణంగా ఇద్దరు స్టార్ డైర్టెక్టర్లు కూడా స్టక్ అయిపోయారు. ఆచార్యలో చరణ్‌తో ఒక ప్రత్యేక పాత్ర చేయించడం కోసం కొరటాల శివ చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు.

ఆర్.ఆర్.ఆర్. కంటే ముందు ఆచార్య వస్తే తన సినిమాకు క్రేజ్ పరంగా కాస్త ఎఫెక్ట్ వుంటుందని రాజమౌళి ఇంతవరకు దీనిపై చరణ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్. మరీ ఆలస్యం అవుతోంది కనుక చరణ్ ముందుగా ఆచార్య పని చూస్తాడా లేదా అన్న క్లారిటీ ఇంకా రాలేదు.

అలాగే ఎన్టీఆర్‌తో సినిమా ఖాయం చేసుకున్న త్రివిక్రమ్ కూడా ఇప్పుడు తన కోసం చాలా కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ ఇద్దరు దర్శకుల మార్కెట్ వేల్యూ కూడా వంద కోట్ల పైమాటే. ఆర్.ఆర్.ఆర్. పేరు మీద ఇలా నలుగురు స్టక్ అయిపోయారన్నమాట.

ఆ సినిమా ఎవడూ చూడడని ముందే తెలుసు

ఒక వైపు నుయ్యి మరోవైపు గొయ్యి.. ఈ 'దేశం'కి ఏమైంది