‘అమ్మ’ బయోపిక్ రూపకర్తలకు నోటీసులు!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను తీస్తామంటూ  చాలా  మంది అనౌన్స్ చేశారు. జయలలిత మరణించినప్పుడే అలాంటి ప్రకటనలు చాలా మంది చేశారు. అయితే ఇప్పటి వరకూ పట్టాలెక్కింది తక్కువే. Advertisement రెండు…

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను తీస్తామంటూ  చాలా  మంది అనౌన్స్ చేశారు. జయలలిత మరణించినప్పుడే అలాంటి ప్రకటనలు చాలా మంది చేశారు. అయితే ఇప్పటి వరకూ పట్టాలెక్కింది తక్కువే.

రెండు సినిమాలు మాత్రం కొంత వరకూ ముందుకెళ్లాయి. అయితే జయలలిత బయోపిక్ అంటే మాటలు కాదు. ఏ మాత్రం వివాదం అయినా మొదటికే మోసం వస్తుంది. జయలలిత జీవితం గురించి ఎన్నో విషయాలు రహస్యాలుగానే ఉన్నాయి కూడా. అలాంటి రహస్యాలను చూపకపోతే సినిమానే ఇంట్రస్టింగ్ గా ఉండదాయె.

అందునా తమిళనాట ఇంకా అన్నాడీఎంకే అధికారంలోనే ఉంది. జయలలిత ఇమేజే ఆ పార్టీకి రక్ష. కాబట్టి.. తేడా వస్తే ఆ పార్టీ వాళ్లు సినిమా వాళ్లను నలిపేస్తారు. అయినా కొందరు సాహసంగా ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేశారు.

అలాంటి వారికి తాజాగా కోర్టు నోటీసులు అందాయట. జయలలిత మేనకోడలు దీప ఇప్పటికే జయ బయోపిక్ లపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా సినిమాలు రావడానికి వీల్లేదని ఆమె కోర్టును కోరారు. ఈ మేరకు జయలలలిత బయోపిక్ లను అనౌన్స్ చేసిన.. గౌతమ్ మీనన్, ఏఎల్ విజయ్ లకు కోర్టు నోటీసులు జారీ చేసింది.