ఎన్టీఆర్ సతీమణికి పదవి?

వైకాపా పార్టీ అధికారంలోకి రావడానికి చేయూత నిచ్చిన చాలా మందికి ఏదో ఒక పదవి ఇస్తూనే వస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి. Advertisement అయితే పార్టీ తరపున వాయిస్ గా టీవీ చానెళ్లలో, ఇంటర్వూల్లో…

వైకాపా పార్టీ అధికారంలోకి రావడానికి చేయూత నిచ్చిన చాలా మందికి ఏదో ఒక పదవి ఇస్తూనే వస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి.

అయితే పార్టీ తరపున వాయిస్ గా టీవీ చానెళ్లలో, ఇంటర్వూల్లో గత అయిదేళ్ల పాటు విరివిగా వినిపించిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతికి మాత్రం ఇప్పటి వరకు ఏ పదవి రాలేదు. అయితే త్వరలోనే ఆమెకు కూడా ఓ పదవి రాబోతున్నట్లు తెలుస్తోంది. 

సాహిత్య, సంగీత కళా రంగాల్లో అభినవేశం వున్ననందమూరి లక్ష్మీపార్వతికి ఆ విధమైన పదవినే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మహిళా కమిషన్ చైర్ పర్సన్ లాంటి పదవి లక్ష్మీపార్వతికి వస్తుందని కొన్నాళ్ల క్రితం ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. కానీ అయితే అవేవీ వాస్తవ రూపం దాల్చలేదు.

అయితే సాంస్కృతిక సలహాదారు లాంటి పదవి ని లక్ష్మీ పార్వతికి ఇచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. నిజానికి అది కూడా ఆమెకు సూటయినదే. ఎందుకంటే ఆమె సాహిత్య, కళా రంగం నుంచే ఎన్టీఆర్ జీవితంలోకి, ఆపై రాజకీయాల్లోకి వచ్చారు.

అందువల్ల ఆ రంగంలో కాస్త మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడానికి తగిన సూచనలు ఆమె ఇచ్చే అవకాశం వుంది.