అందుకే విజయారెడ్డిని హత్య చేశాను: సురేశ్‌

వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్‌ తెలిపాడు. Advertisement అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే సురేశ్‌ అగ్నికి ఆహుతి చేసిన…

వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్‌ తెలిపాడు.

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే సురేశ్‌ అగ్నికి ఆహుతి చేసిన విషయం విదితమే.  

గత కొంతకాలంగా పట్టా ఇవ్వాలని కోరుతున్నానని, సోమవారం నాడు కూడా అడిగానని అతడు పోలీసలకు చెప్పాడని కదనం. కాగా విజయారెడ్డి డ్రైవర్ గురునాదం కూడా కాలిన గాయాలతో మరణించాడు. విజయారెడ్డిని రక్షించబోగా అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.

ఇదిలా ఉండగా ఈ ఘటన వెనుక భూమి మాఫియా, రాజకీయ నేతల ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మల్ రెడ్డి రగంగారెడ్డి ఆరోపించారు. స్తానిక ఎమ్మెల్యే హస్తం ఈ ఘటన వెనుక ఉందని రంగారెడ్డి ఆరోపించారు.

కాగా కోర్టు వివాదంలో ఉన్న స్తలానికి సంబందించి తహశీల్దార్ ఏమి చేయలేరని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తెలిపాయి.