ఇండస్ట్రీలో హీరోయిన్ రకుల్, మంచు లక్ష్మి మంచి ఫ్రెండ్స్ అనే సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరూ అంతలా ఎలా కలిసిపోయారు? వీళ్ల మధ్య బాగా సింక్ అయిన ఎలిమెంట్స్ ఏంటి? ఈ విషయాల్ని స్వయంగా రకుల్ బయటపెట్టింది.
“నేను లక్ష్మి ఒకే రకంగా ఆలోచిస్తాం. మేం పార్టీలు చేసుకోం. ఎందుకంటే నేను మందుకొట్టను. కాబట్టి లక్ష్మితో కలిస్తే నాకు ఫిట్ నెస్ పైనే ధ్యాస. మేమిద్దరం కలిస్తే ఎక్కువ సినిమాలు చూస్తాం. ఎక్కువగా వర్కవుట్స్ చేస్తాం. సైక్లింగ్, ట్రెక్కింగ్ చేస్తుంటాం. కలిసి వంట చేసుకుంటాం. ఈ కరోనా టైమ్ లో మేం మూడో వ్యక్తిని కలవలేదు. నేను బయటకెళ్తే లక్ష్మి ఇంటికే. లక్ష్మి బయటకొస్తే నా ఇంటికే వస్తుంది.”
ఇలా మంచు లక్ష్మితో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టింది రకుల్. ఈ సందర్భంగా తన సినిమాలపై కూడా స్పందించింది.
“హిందీలో ఇప్పుడు 2 సినిమాలు జరుగుతున్నాయి. మరో 2 సైన్ చేశాను. అవి త్వరలోనే చెబుతా. తెలుగులో నితిన్ సినిమా, క్రిష్ సినిమా చేతిలో ఉన్నాయి. తమిళ్ లో కూడా ఇండియన్-2, శివకార్తికేయ సినిమాలున్నాయి. ఇంకా కొన్ని కథలు వింటున్నాను. కొత్త నిర్ణయాలేవీ తీసుకోలేదు.”
క్రిష్ దర్శకత్వంలో సినిమాను ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు ప్రకటించిన రకుల్.. మరో 10 రోజుల్లో అర్జున్ కపూర్ తో బాలీవుడ్ మూవీ కూడా స్టార్ట్ చేయబోతున్నానని తెలిపింది.