మిడ్ నైట్ రన్నర్స్…శాకిని..డాకిని

రణరంగం లాంటి డిజాస్టర్ తరువాత దర్శకుడు సుధీర్ వర్మ మూడు సినిమాలు చేస్తున్నారు. నిఖిల్ హీరోగా లండన్ బేస్డ్ సినిమా ఒకటి తయారవుతోంది.  Advertisement రవితేజ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ ఒకటి ప్రకటించారు. ఈ…

రణరంగం లాంటి డిజాస్టర్ తరువాత దర్శకుడు సుధీర్ వర్మ మూడు సినిమాలు చేస్తున్నారు. నిఖిల్ హీరోగా లండన్ బేస్డ్ సినిమా ఒకటి తయారవుతోంది. 

రవితేజ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ ఒకటి ప్రకటించారు. ఈ లోగా కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా సురేష్ బాబు, గురు ఫిలింస్ కాంబినేషన్ లో ఓ రీమేక్ ను కానిచ్చేసారు. రెజీనా, నివేదా కాంబినేషన్ లో తయారైన ఈ సినిమాకు కొరియన్ సినిమా 'మిడ్ నైట్ రన్నర్స్' ఆధారం. 

ఆ సినిమా ఆధారంగా తయారవుతున్న ఈ సినిమాకు శాకిని డాకిని అనే డిఫరెంట్ నేమ్ ఫిక్స్ చేసారు. ఓ కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.  

సినిమా పూర్తిగా హీరోయిన్ బేస్డ్ గానే సాగుతుంది. నివేదా, రెజీనా ఆ రెండు కీలక పాత్రలను పోషిస్తున్నారు. కొరియన్ సినిమాల్లో మంచి కమర్షియల్ హిట్ అనిపించుకున్న ఈ సినిమాను మాతృక నిర్మించిన థామస్ కిమ్ కూడా తెలుగు సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వున్నారు.