మరో నెల రోజులు రెస్ట్

లెక్కప్రకారం నిన్నట్నుంచి సెట్స్ పైకి రావాలి రానా. ఇతడి రాక కోసం విరాటపర్వం సినిమా యూనిట్ దాదాపు 40 రోజులుగా వెయిటింగ్. మొన్నటివరకు రానా లేకపోయినా షూటింగ్ కానిచ్చారు. సాయిపల్లవి పార్ట్ షూటింగ్ మొత్తం…

లెక్కప్రకారం నిన్నట్నుంచి సెట్స్ పైకి రావాలి రానా. ఇతడి రాక కోసం విరాటపర్వం సినిమా యూనిట్ దాదాపు 40 రోజులుగా వెయిటింగ్. మొన్నటివరకు రానా లేకపోయినా షూటింగ్ కానిచ్చారు. సాయిపల్లవి పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తిచేశారు. కానీ రానా లేకుండా ఇక ఎంతమాత్రం షూటింగ్ నడవదు.

అయితే రానా అందుబాటులోకి రాలేదు. అతడు మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడు. అవును.. డిసెంబర్ 1 వరకు విరాటపర్వం సెట్స్ పైకి రాడు రానా.

కిడ్నీలకు సంబంధించిన సమస్యతో రానా కొన్నాళ్లుగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికాలో అతడికి ఆపరేషన్ కూడా జరిగింది.

ఆ సర్జరీ నుంచి కోలుకుంటున్న రానా, మరికొన్నాళ్ల పాటు షూటింగ్ లకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు.

విరాటపర్వంలో నక్సలైట్ గా కనిపించబోతున్నాడు రానా. 1980ల్లో తెలంగాణ పల్లెల్లో జరిగిన నక్సలిజంను నేపథ్యంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. వరంగల్ పల్లెలో జరిగిన ఓ యదార్థ గాథకు ఫిక్షన్ జోడించి ఈ సినిమా తీస్తున్నాడు.

ఇందులో రవన్న అనే నక్సల్ గా మోస్ట్ ఎగ్రెసివ్ గా రానా కనిపించబోతున్నాడు. అతడి కోసం పరితపించే పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది.