వారసుడు సినిమా ట్రయిలర్ పై భారీ ట్రోలింగ్

సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని ట్రయిలర్ చెప్పేస్తుంది. వారసుడు ట్రయిలర్ వచ్చేసింది, సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేసింది. కోలీవుడ్ లో ఈ ట్రయిలర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనే విషయాన్ని పక్కనపెడితే, టాలీవుడ్ లో…

సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని ట్రయిలర్ చెప్పేస్తుంది. వారసుడు ట్రయిలర్ వచ్చేసింది, సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేసింది. కోలీవుడ్ లో ఈ ట్రయిలర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనే విషయాన్ని పక్కనపెడితే, టాలీవుడ్ లో మాత్రం దీనిపై హెవీ ట్రోలింగ్ నడుస్తోంది.

వారసుడు ట్రయిల్ లో బ్రహ్మోత్సవం, అల వైకుంఠపురములో, మహర్షి, బృందావనం, అజ్ఞాతవాసి.. ఇలా చాలా సినిమాల పోలికలు కనిపిస్తున్నాయంటూ తెగ పోస్టులు పడుతున్నాయి. మరోవైపు ఈ ట్రయిలర్ పై మీమర్స్ రెచ్చిపోతున్నారు. రకరకాల మీమ్స్ తో చెలరేగిపోతున్నారు.

ఇది చాలదన్నట్టు, అల వైకుంఠపురములో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నే దాదాపుగా వారసుడు ట్రయిలర్ లో కూడా వినిపించాడు తమన్. దీంతో వారసుడు ట్రయిలర్ లో ప్రతి సన్నివేశాన్ని ఏదో ఒక తెలుగు సినిమాలో చూసినట్టు ఉందంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు.

ట్రయిలర్ చూస్తే రొటీన్ స్టఫ్ అని అర్థమైపోయింది. ఫంక్షన్ లో దిల్ రాజు మాత్రం కచ్చితంగా హిట్ కొడతాం అంటున్నాడు. సో.. ట్రయిలర్ కు మించి ఇంకేమైనా ట్విస్టులు, కొత్తదనం సినిమాలో ఉండి ఉండాలి. దిల్ రాజు నమ్మకం ఎంత వరకు కరెక్ట్ అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.