బికీనీ పోజులు.. ఈమెను ఉనికిలో నిలుపుతాయా!

కొన్నాళ్ల కిందట భర్త నుంచి విడాకులు తీసుకుని వివాహ బంధం నుంచి బయటకు వచ్చింది కిమ్ శర్మ. దాదాపు పదిహేనేళ్ల కిందట బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపును పొందింది కిమ్. అదే…

కొన్నాళ్ల కిందట భర్త నుంచి విడాకులు తీసుకుని వివాహ బంధం నుంచి బయటకు వచ్చింది కిమ్ శర్మ. దాదాపు పదిహేనేళ్ల కిందట బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపును పొందింది కిమ్. అదే సమయంలో నాటి భారత జట్టు క్రికెటర్ యువరాజ్ సింగ్ తో సన్నిహితంగా మెలిగింది.

వారి ప్రేమ మీడియాలో చర్చగా నిలిచింది. ఆ తర్వాత బ్రేకప్, కిమ్ శర్మ కెరీర్ మందగించడం, ఆమె పెళ్లి చేసుకుని ఏదో విదేశం  వెళ్లడం జరిగింది. అయితే కిమ్ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చింది. విడాకులు  తీసుకుని మళ్లీ బాలీవుడ్ లో అవకాశాల వేట చేపట్టింది.

అదే సమయంలో నటుడు హర్షవర్ధన్ రాణేతో కిమ్ ప్రేమాయణం మొదలుపెట్టింది.  అయితే ఇటీవలే అతడితో కూడా కిమ్ కు బ్రేకప్  అయ్యిందట. ఇప్పుడు కిమ్ శర్మ మళ్లీ సోలో అయ్యిందట. ఈ క్రమంలో తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ నటీమణి బికినీ స్టిల్స్ వరసగా పోస్టు చేస్తూ ఉంది. ప్రస్తుతం కిమ్ వయసు ముప్పై  తొమ్మిది. ఇలాంటప్పుడు బికినీ పోజులు ఈమెను  ఉనికిలో నిలుపుతాయా?