విజయ్ మీద భారం పడుతుందా?

విజయ్ దేవరకొండ స్వంత ప్రొడక్షన్ మీకు మాత్రమే చెబుతా ఘొరంగా ఫెయిల్ అయింది బాక్సాఫీస్ ధగ్గర. ఇది ఎంత మాత్రం ఊహించని పరిణామం. Advertisement ఎందుకంటే జస్ట్ రెండున్నర కోట్లకు థియేటర్ హక్కులు ఇచ్చేసారు.…

విజయ్ దేవరకొండ స్వంత ప్రొడక్షన్ మీకు మాత్రమే చెబుతా ఘొరంగా ఫెయిల్ అయింది బాక్సాఫీస్ ధగ్గర. ఇది ఎంత మాత్రం ఊహించని పరిణామం.

ఎందుకంటే జస్ట్ రెండున్నర కోట్లకు థియేటర్ హక్కులు ఇచ్చేసారు. కర్ణాటక, తమిళనాడు తో సహా. అందువల్ల బ్రేక్ ఈవెన్ అన్నది పెద్దగా సమస్య కాదు అనుకున్నారు అంతా.

కానీ అన్ సీజన్ కావడమో, మార్కెట్ లో విజిల్, ఖైదీ లాంటి సినిమాలు వుండడమో, సినిమా జనాలకు పట్టకపోవడమో మొత్తానికి ఆంధ్ర, సీడెడ్ ల్లో సినిమా ను పూర్తిగా రిజెక్ట్ చేసారు. 

విశాఖ ఏరియాకు అభిషేక్ అగర్వాల్ 40 లక్షలకు కొనుగోలు చేసారు. కానీ గట్టిగా పది లక్షలు వచ్చేలా కనిపించడం లేదు. 

మిగిలిన ఏరియాలు అన్నీ ఏషియన్ సునీల్ నేరుగా సురేష్ మూవీస్ ద్వారా విడుదల చేసుకున్నారు. నైజాం మాత్రం కాస్త బాగుంది. అందువల్ల టోటల్ గా చూసుకుంటే ఓ అరవై లక్షల మేరకు నష్టం రావచ్చని ట్రేడ్ వర్గాల బోగట్టా. 

ఇదిలా వుంటే ఓవర్ సీస్ ను 80 లక్షలకు అమ్మారు. వేరే బయ్యర్ 75 లక్షల వరకు వెళ్తే 81కి తగ్గమని చెప్పి, 80కి అమ్మారు. కానీ ఇప్పడు అక్కడ బయ్యర్ కు ఖర్చులు కూడా కిట్టుబాటు కావని ఓవర్ సీస్ ట్రేడ్ వర్గాల బోగట్టా. 

నిర్మాతగా మాత్రం విజయ్ దేవరకొండకు జాక్ పాట్ నే. ఎందుకంటే థియేటర్ ల ద్వారా 2.50 కోట్లు, శాటిలైట్ ద్వారా రెండు కోట్లు వచ్చాయని వార్తలు ఇప్పటికే బయటకు వచ్చాయి.

ఇంకా డిజిటల్ రైట్స్ కూడా వున్నాయి. అన్నీ కలిపి అయిదు కోట్లు చూసుకున్నా, మంచి లాభాలే వచ్చినట్లు. అందువల్ల ఏషియన్ సునీల్ కు, ఓవర్ సీస్ బయ్యర్ కు ఏమైనా వెనక్కు ఇస్తారేమో చూడాలి.