క్రీడా నేపథ్యపు సినిమాలు తీసి మెప్పించడం అంత సులువు కాదు. అందుకే మన తెలుగు సినిమాల్లో ఫ్యామిలీ డ్రామానో, రివెంజ్ డ్రామానో దానికి జోడించి, ఇవే క్రీడా సినిమాలు అనిపించేసుకుంటారు.
మజిలీ, జెర్సీ లాంటి సినిమాల్లో క్రీడలను కాస్త గట్టిగానే చిత్రీకరించినా జస్ట్ ఓకె అని మాత్రమే అనిపించుకున్నాయి. మొన్నటికి మొన్న వచ్చిన విజిల్ సినిమా కూడా అయిదారు కోట్ల సినిమాగా మిగిలింది తప్ప తెలుగు నాట మరీ పెద్ద సినిమా కాలేదు.
పైగా ఇప్పటి వరకు వచ్చినవి అన్నీ సామాన్య జనాలకు బాగా పరిచయం వున్న కబడ్డీ, క్రికెట్, ఫుట్ బాల్ లాంటి గేమ్స్. తెరమీద ఉత్కంఠ రేకెత్తించడం, కామన్ ఆడియన్స్ ను ఆ గేమ్ ను ఫీలయ్యేలా చేయడం కష్టం అయిన క్రీడ చదరంగం. ఇప్పుడు ఈ గేమ్ నేపథ్యంలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమా చేస్తున్నారు హీరో నితిన్ తో కలిసి.
చదరంగంలో ఇండియాను అగ్రస్థానంలో నిలిపడం, దాని వల్ల హీరో చేసిన ఉరిశిక్షకు సరిపడా నేరాన్ని ప్రభుత్వం క్షమించడం లాంటి లైన్ ఏదో వుందని తెలుస్తోంది.
లైన్ సంగతి ఎలా వున్నా, ఈ చదరంగం మీద ఉత్కంఠ రేపే క్లయిమాక్స్, ఎమోషనల్ బాండింగ్ ఎలా తీసుకువస్తారో చంద్రశేఖర్ యేలేటి అన్నిది చూడాలి.
చంద్రశేఖర్ యేలేటి మంచి సినిమాలు అందించారు. అందువల్ల చదరంగం క్రీడను సినిమా ప్రేక్షకులకు దగ్గరగా ఎలా తీసుకెళ్తారో చూడాలి.