ఆంధ్రలో రేట్ల కోసం చూసి చూసి, ఇక ఇప్పట్లో రావు అని డిసైడ్ అయిపోతున్నారు టాలీవుడ్ జనాలు. పెద్ద సినిమాల డేట్ లు చాలా దూరంగా వున్నాయి. పుష్ప విడుదలకు ఇంకా నెలన్నర టైమ్ వుంది. ఆర్ఆర్ఆర్, ఆచార్య సంగతి సరేసరి. బాలయ్య అఖండ సినిమా ఫస్ట్ కాపీ అన్ని విధాలా రెడీ అయిపోయి వుంది. కానీ రేట్ల కోసం చూస్తున్నారు. అవి వస్తాయో, రావో తెలియదు.
ఇలాంటి టైమ్ లో ఇక ఏ నిర్మాత అయినా ఎన్నాళ్లు ఓపిక పడతారు. కోట్లకు కోట్లు వడ్డీలు కట్టుకుంటూ. వెయిట్ చేయగలరు? అఖండ సినిమాను మంచి రేట్లకు మార్కెట్ చేసారు. నైజాం సాయి కొర్రపాటి, ఎన్వీ ప్రసాద్ కలిపి తీసుకున్నారు. ఆంధ్ర పలువురు రకరకాల ఏరియాలు తీసుకున్నారు. ఆంధ్ర 35 కోట్ల మేరకు మార్కెట్ చేసారు. అదే రేషియోలో సీడెడ్ కూడా.
ఇప్పుడు రేట్లు తక్కువలో వున్న నేపథ్యంలో ఏ రేషియో అంటే డిస్ట్రిబ్యూటర్లు వెనుకంజ వేస్తున్నారు. కాస్త తగ్గించమని అడుగుతున్నారు. అందుకే ముందు డేట్ వేసేసి ఆపై డిస్కషన్లు పెట్టే ఆలోచనలో వున్నారు మేకర్లు
దీపావళి నాడు డేట్ అనౌన్స్ చేసే అవకాశం వుంది. బహుశా డిసెంబర్ 2 అన్నది డేట్ కావచ్చు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మీద చాలా భారీ అంచనాలు వున్నాయి.