పవన్ 2 కి.మీ నడవలేకపోయారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ పేరు పెట్టుకుని కనీసం రెండు కిలోమీటర్లు నడవేలేకపోయారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అనకాపల్లి ఎమ్మల్యే గుడివాడ అమరనాద్ విమర్శించారు. Advertisement పవన్ కల్యాణ్ చేసింది లాంగ్…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ పేరు పెట్టుకుని కనీసం రెండు కిలోమీటర్లు నడవేలేకపోయారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అనకాపల్లి ఎమ్మల్యే గుడివాడ అమరనాద్ విమర్శించారు.

పవన్ కల్యాణ్ చేసింది లాంగ్ మార్చ్ కాదని, వెహికల్ మార్చ్ చేశారన్నారు. శాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా నేతలను పక్కన పెట్టుకుని పవన్ మాట్లాడారని ఎద్దేవా చేశారు.

ఇసుక సమస్యను పరిష్కరించడం కోసం వైసీపీకి గడువు ఇవ్వడానికి పవన్ ఎవరని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్ పై ద్వేషం , ఈర్ష్యతో పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారని ఆయన అన్నారు.పవన్ కళ్యాణ్ నదుల చెంత లాంగ్ మార్చ్ చేస్తే విషయం తెలిసేదని ఆయన అన్నారు.