బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 ముగిసింది. అండర్‌డాగ్‌గా బిగ్‌హౌస్‌లోకి ఎంటర్ అయిన రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ .. విన్నర్‌గా కాలర్ ఎగరేశాడు.
డౌన్‌టూ ఎర్త్ వ్యవహారశైలితో ఓట్లు కొల్లగొట్టాడు. దీంతో టైటిల్ ఫెవెరెట్‌గా హౌస్‌లో సందడిచేసిన పటాకా శ్రీముఖి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతిని, బిగ్‌బాస్ ట్రోఫిని రాహుల్ అందుకున్నాడు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తనకు ఓట్లు వేసి గెలిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు చేశారు. ఈ విజయం తనను 10 మెట్లు పైకి ఎక్కించాయని, ఇక నుంచి తన లైఫ్ కొత్తగా ఉండబోతుందని చెప్పారు.
తన విజయంలో తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రేక్షకులు ఎంతో సహకరించారని రాహుల్ అన్నారు.