రాజా విక్రమార్క…ఈ ట్రయిలర్ వేరే

హీరో కార్తికేయ సినిమాల జయాపజయాలు ఎలా వున్నా ఎంచుకునే సబ్జెక్ట్ లు కాస్త భిన్నంగానే వుంటాయి.  Advertisement కార్తికేయ నటించిన లేటెస్ట్ సినిమా రాజా విక్రమార్క ట్రయిలర్ కూడా అదే చెప్పింది.  ట్రయిలర్ లో…

హీరో కార్తికేయ సినిమాల జయాపజయాలు ఎలా వున్నా ఎంచుకునే సబ్జెక్ట్ లు కాస్త భిన్నంగానే వుంటాయి. 

కార్తికేయ నటించిన లేటెస్ట్ సినిమా రాజా విక్రమార్క ట్రయిలర్ కూడా అదే చెప్పింది.  ట్రయిలర్ లో రొటీన్ మాస్ ఎలిమెంట్లు కనిపిస్తూనే, సబ్జెక్ట్ లో నావల్టీ వుందని అని క్లారిటీ ఇచ్చేసింది.

థ్రిల్లింగ్ విషయాన్ని దాచి, ఫన్ , ఎంటర్ టైన్ మెంట్ ను మాత్రం ట్రయిలర్ లోకి తీసుకుచ్చారని అర్థం అవుతోంది. కార్తికేయ ఎప్పటిలాగే ఫన్ ,డ్యాన్స్ లు తన స్పెషల్ అన్నట్లుగా ట్రయిలర్ లో పెట్టాడు. కానీ అక్కడితో ఆగిపోతే రొటీన్ సినిమా అనుకునే ప్రమాదం వుందని కొద్దిగా రివీల్ చేసారు.

మొత్తం మీద ట్రయిలర్ ఆసక్తి కరంగానే వుంది. పెద్దగా హడావుడి, బజ్ లేకుండా వుంది ఇప్పటి వరకు ఈ సినిమా. ట్రయిలర్  జనంలోకి వెళ్తే కచ్చితంగా ఆసక్తి పెరిగే అవకాశం వుంది.  సరిపల్లి శ్రీ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను అందిస్తున్నారు. తన్య రామచంద్రన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తనికెళ్ల, పుశుపడి, హర్షవర్ధన్, సాయికుమార్ లాంటి మంచి నటులు వున్నారు.