ఉందో లేదో తెలియని పార్టీకి కొత్త అధ్యక్షుడు!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత జరిగిన రెండో ఎన్నికల్లో కూడా జనాలు కాంగ్రెస్ పార్టీని  నిర్ధంద్వంగా తిరస్కరించారు. ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ రఘువీరారెడ్డి…

ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత జరిగిన రెండో ఎన్నికల్లో కూడా జనాలు కాంగ్రెస్ పార్టీని  నిర్ధంద్వంగా తిరస్కరించారు. ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 

తమకు ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు కాదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడే ఆ పార్టీకి మరింతగా మూడింది. చంద్రబాబుతో చేతులు కలపకుండా ఉంటే కాంగ్రెస్ కు ఏ రెండు మూడు శాతమో ఓట్లు వచ్చేవేమో. చంద్రబాబుతో చేతులు కలిపేసరికి ఆ ఓటు బ్యాంకు కూడా తగ్గిపోయింది.

తమదోస్తు చంద్రబాబుతో సహా నిండా మునిగింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇప్పుడు రిపేర్లు కొనసాగుతాయట. అసలు రిపేర్లు చేసినా పనికి  వచ్చే స్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ అనేది జనాభిప్రాయం.  అయితే కాంగ్రెస్ వాళ్లు మాత్రం పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించబోతున్నారట.  రఘువీర ఐదు నెలల కిందట రాజీనామా చేస్తే ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోందట. 

అందులో భాగంగా నలుగురు నేతలను ఎంపిక చేశారట. మాజీ మంత్రి శైలజనాథ్, మాజీ  ఎంపీ చింతా మోహన్ , గిడుగు రుద్రరాజు, సుంకదర పద్మశ్రీ..  ఈ నలుగురిలో ఎవరో  ఒకరికి ఏపీసీసీ అధ్యక్ష పదవిని ఇస్తారట. మరి ఈ నలుగురిలో ఎవరికి ఇచ్చినా పెద్దగా తేడా లేకపోవచ్చు అనేది విశ్లేషకుల మాట!