రాజధాని పెడితే విశాఖ గొంతు ఎండుతుందా..?

అపర మేధావులు మనకు పుట్టుకువస్తున్నారు. వీరికి చాన్స్ ఇస్తే కరోనాకు వందల, వేలల్లో వ్యాక్సిన్ లను కూడా తయారుచేయగలరు, అవి పనికి వస్తాయో లేదో తరువాత చూడాలి కానీ దేనికైనా రెడీ మరి. Advertisement…

అపర మేధావులు మనకు పుట్టుకువస్తున్నారు. వీరికి చాన్స్ ఇస్తే కరోనాకు వందల, వేలల్లో వ్యాక్సిన్ లను కూడా తయారుచేయగలరు, అవి పనికి వస్తాయో లేదో తరువాత చూడాలి కానీ దేనికైనా రెడీ మరి.

ఇదిలా ఉంటే విశాఖ రాజధాని విషయంలో అడ్డుపుల్లలు ఎన్ని వేయాలో అన్నీ వేస్తున్నారు. ఇప్పటికే చాలా భయాలు పెట్టారు. విశాఖ రౌడీ రాజ్యం అవుతుందని, భూ కబ్జాలు జరుగుతాయని, జనాలు ఇబ్బంది పడతారని ఎన్నో కల్పించి చెప్పారు.

మరో వైపు విశాఖ హుదూద్ తుఫాన్లకు  గురి అవుతుందని, సముద్రమే అడ్డంగా చీలి సునామీ వస్తుందని కూడా పరిశోధించి మరీ చెప్పారు. ఇపుడు కొత్తగా బీరూట్ ని ముందుకు తెచ్చి విశాఖలో కూడా అమ్మోనియం నైట్రేట్ నిల్వలు చాలా ఉన్నాయని, అందువల్ల ఏదైనా అనుకోనిది జరిగితే విశాఖ సర్వనాశనం అవడం కావడం అంటూ జోస్యాలు వదులుతున్నారు.

దానికి తోడు అన్నట్లుగా విశఖలో రాజధాని పెడితే నీటికి కటకట వస్తుందని కొత్తగా మరో భయాన్ని జత చేస్తున్నారు. విశాఖ పెరిగే నగరం అని దాని మీద రాజధాని భారం పెడితే తాగు నీటికే జనాలు తన్నుకుచావాల్సివస్తుందని కూడా అమరావతిని మెచ్చే అపరమేధావులు కొత్త నినాదం అందుకుంటున్నారు.

విశాఖలో ఇక మీదట నీటిని కూడా కొనుక్కోవాలట. తాగేందుకు గుక్కెడి నీళ్లు దొరకవట. ఇదీ వీరి పరిశోధనా సారాంశం. ఈ మధ్య వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ సముద్రపు నీటిని తీసుకుని డీ శాలిటేషన్ ప్లాంట్ పెట్టి పరిశ్రమలకు నీరు అందించే ప్రాజెక్ట్ ను తమ ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు.

దాన్ని పట్టుకుని చూశారా నీళ్ళు లేవని తెలిసి కూడా విశాఖలో రాజధాని పెడుతున్నారు. ఇపుడే ఇలా ఉంటే రేపటి రోజున ఏం జరుగుతుంది అని కొత్త డౌట్లు బయటపెడుతున్నారు. ఇవన్నీ సరే కానీ విశాఖ జనాభాను రాజధాని వచ్చిన తరువాత కలుపుకుని కూడా 2050 నాటికి జగన్ ప్రణాళికలు తయారు చేయిస్తున్నారు.

ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే ఉత్తరాంధ్రా జిల్లాలకు నీటి కొరత ఎప్పటికీ రాదు అన్నది అందరికీ తెలిసిందే. మరో వైపు ఉత్తరాంధ్రా సుజల స్రవంతి కి కూడా జగన్ శ్రీకారం చుట్టారు. నిజాలు ఇలా ఉంటే గుక్కెడు నీటికి జనం తన్నుకుంటారంటూ తన్నీర్ తన్నీర్ కధలు వినిపిస్తోంది అపర మేధావితనం. నీరు ఎపుడూ సెంటిమెంటే కాబట్టి ఇలా చిచ్చు రగల్చాలని చూస్తున్నారనుకోవాలి.

చంద్రబాబుకి తెలంగాణాలో నోరెత్తే దమ్ములేదు