అమరావతి.. అది టీడీపీ వారికి కూడా ఇపుడు భ్రమరావతిగా మారుతోంది. కేవలం చంద్రబాబుకు మాత్రమే కలల రాజధాని అది. అమరావతి దేశంలోనే అతి పెద్ద స్కాం అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధరావు.
మైసూర్ బోండాలో మైసూరు ఎక్కడ ఉంటుందో అమరావతిలో రాజధానిలో కూడా అంతే ఉంటుందని భలే పంచ్ కూడా వేస్తున్నారు. అమరావతి పేరు చెప్పి బాబు అయిదేళ్ళల్లో విశాఖను అసలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
విశాఖను జగన్ రాజధాని చేస్తామంటే ఎందుకంత అక్కసు చంద్రబాబూ అని నిలదీస్తున్నారు. టీడీపీ 22 ఏళ్ళ పాలనలో విశాఖను ఎంత అభివ్రుధ్ధి చేశారో వైఎస్సార్, జగన్ హయాంలో జరిగిన అభివ్రుద్ధి ఏంటో చర్చకు వస్తారా అంటూ సవాల్ చేశారు.
విశాఖలో 20 లక్షల పెట్టుబడులు ఎక్క్డ పెట్టారు బాబూ అని కూడా గుడివాడ గుడ్లుమురుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అమ్మోనియం నైట్రేట్ నిల్వలు విశాఖలో ఉన్నాయని ప్రమాదం అంటూ బాబు దీర్ఘాలు తీస్తూంటే దీని వెనక కూడా ఏమైనా కుట్ర చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని కూడా గుడివాడ అంటున్నారు. మొత్తానికి విశాఖకు ఏమీ చేయని చంద్రబాబును తమ్ముళ్ళు కూడా నమ్మవద్దని గుడివాడి ఇస్తున్న పిలుపు పచ్చ పార్టీకి కంపరం రేకెత్తించేదేగా.