తమ అను”కుల” మీడియాలో నచ్చినట్టు రాయించుకోవడం, తెల్లారిన వెంటనే ఆ పేపర్ కటింగ్ ను సోషల్ మీడియాలో పెట్టి ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యానాలు జోడించడం పచ్చ తండ్రికొడుకులకు అలవాటుగా మారింది. ఈరోజు కూడా అదే జరిగింది. ట్విట్టర్ పక్షి లోకేష్ మరోసారి కూశారు. నెటిజన్లతో చీవాట్లు తింటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే..
“ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నకు డబ్బు చేరలేదు” అంటూ ఆంధ్రజ్యోతి రాసిన కథనాన్ని తన వాల్ కు తగిలించారు లోకేష్. అచ్చెన్న రూపాయి అవినీతి చేయలేదని, కేవలం తెలంగాణలో అమలైన విధానాన్ని అధ్యయనం చేసి అమలు చేయండని చెప్పినందుకు అరెస్ట్ చేశారని ఏదేదో రాసుకున్నారు. దీనిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు.
నిజంగా అచ్చెన్నాయుడు హరిశ్చంద్రుడైతే కోర్టు ఈపాటికి బెయిల్ ఇచ్చేది కదా అంటూ ఒకరు ప్రశ్నిస్తే.. ఆంధ్రజ్యోతి క్లిప్పింగులతో ఎన్నాళ్లు ప్రజల్ని మభ్యపెడతారంటూ మరొకరు కాస్త ఘాటుగానే (ఇక్కడ రాయలేని పదాలతో) తగులుకున్నారు.
తెలంగాణ మోడల్ ను ఫాలో అవ్వమని చెప్పడానికి మంత్రి పదవి ఎందుకు, పదో తరగతి కుర్రాడు కూడా చెబుతాడు కదా అంటూ ఒకరు సెటైర్ వేస్తే.. దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్ కు అది కూడా తెలియదని మరొకరు కవ్వించారు. దమ్ముంటే ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్ తగిలించి బెయిల్ కు మరోసారి అప్లయ్ చేయాలని మరికొందరుర లోకేష్ కు సవాల్ విసిరారు.
అచ్చెన్నాయుడు అవినీతి చేయలేదని అంత బలంగా నమ్ముతున్నప్పుడు రోడ్డుపైకొచ్చి నిరాహార దీక్ష చేయొచ్చుకదా అంటూ లోకేష్ పై కామెంట్స్ పడుతున్నాయి. మరికొందరు సెటైరిక్ గా కనీసం ఒక్క పూట పప్పు భోజనం మానేసెయ్ చూద్దాం అంటూ జోకులేశారు. అయినా ఆంధ్రజ్యోతిలో చెబితే తప్ప అచ్చెన్నాయుడి గురించి నీకు తెలియదా అంటూ మరో సెటైర్.
ఇలా లోకేష్ పై పొద్దున్నుంచి పదుల సంఖ్యలో పంచ్ లు పేలుతూనే ఉన్నాయి. ఇకనైనా లోకేష్ ఈ ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్స్ పట్టుకొని వేలాడ్డం మానుకుంటే బెటర్.