విశాఖను రాజధానిగా ఎందుకు చేయలేకపోయారు బాబూ..?

విశాఖ పట్ల తనకు ఎంతో ప్రేమ ఉందని మరోమారు చంద్రబాబు చెప్పుకున్నారు. అందుకే విశాఖను తమ ప్రభుత్వం ఆర్ధిక రాజధానిగా ప్రకటించిందని కూడా ఆయన అంటున్నారు. ఆర్ధిక రాజధాని వరకూ సరే, అసలు రాజధానిగా…

విశాఖ పట్ల తనకు ఎంతో ప్రేమ ఉందని మరోమారు చంద్రబాబు చెప్పుకున్నారు. అందుకే విశాఖను తమ ప్రభుత్వం ఆర్ధిక రాజధానిగా ప్రకటించిందని కూడా ఆయన అంటున్నారు. ఆర్ధిక రాజధాని వరకూ సరే, అసలు రాజధానిగా ఎందుకు ప్రకటించలేకపోయారో చంద్రబాబు చెప్పాలన్నది మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధుల ప్రశ్న.

విశాఖకు ఏ లోపం ఉందని ఆయన రాజధానిగా ప్రకటించలేదో ఇప్పటికీ చెప్పడంలేదు, పైగా తాను ముఖ్యమంత్రిగా అనేక సదస్సులు విశాఖలో నిర్వహించానని చెప్పుకుంటున్నారు. అలాగే ఎన్నో పెట్టుబడులు విశాఖకు తెచ్చానని బాబు అంటున్నారు.

విశాఖలో పెట్టుబడులు పెడతామని వచ్చిన వారిని అమరావతిలో పెట్టాలని బాబు వత్తిడి చేసిన ఫలితంగా వారు వెనక్కివెళ్ళిపోయారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో వైపు ఆరోపిస్తున్నారు. మరి దానికి సమాధానం చెప్పకుండా పెట్టుబడులు లక్ష్ల కోట్లు విశాఖకు వచ్చేశాయని కలరింగ్ ఇస్తున్న బాబు కనీసం అవి ఎక్కడ పెట్టారో చెబితే బాగుంటుందేమో.

విశాఖకు టీడీపీ చేసిన అభివ్రుధ్ధి ఎవరూ చేయలేదని కూడా ఆయన మరో మాట అంటున్నారు. విశాఖకు తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు వంటి వాటి కోసం  ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన  ఉత్తరాంధ్రా సుజల స్రవంతి పధకాన్ని తన హయాంలో బాబు ఎందుకు పూర్తి చేయలేదని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇక వైసీపీ విశాఖను పాలనారాజధానిగా చేస్తామంటే బాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కూడా ఇప్పటిదాకా సరైన సమాధానం చెప్పలేదని కూడా అంటున్నారు. మొత్తానికి విశాఖకు ఎంతో చేశామని, దానిని జనాలకు  చెప్పమని తమ్ముళ్లకు పిలుపు ఇస్తున్న బాబు విశాఖ అభివ్రుద్ధి గురించి తమతో  చర్చించగలరా అని వైసీపీ నేతలు సవాల్ చేస్తే జవాబు ఉంటుందా.

ఆదిపురుష్ కేవలం యుద్దకాండ ?

జగన్ ని ఎలా దెబ్బ కొట్టాలి