గంగవరం…గరం గరం

విశాఖలోని గంగవరం పోర్టు గత కొంతకాలంగా గరం గరంగా మండుతోంది. పోర్టు యాజమాన్యం హక్కులు పూర్తిగా అదానికే చెందడంతో వామపక్షాలు కార్మికులు నిర్వాసితుల పక్షాల పోరాటం చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి గంగరవం పోర్టు…

విశాఖలోని గంగవరం పోర్టు గత కొంతకాలంగా గరం గరంగా మండుతోంది. పోర్టు యాజమాన్యం హక్కులు పూర్తిగా అదానికే చెందడంతో వామపక్షాలు కార్మికులు నిర్వాసితుల పక్షాల పోరాటం చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి గంగరవం పోర్టు పరిసరాలు గరం గరం గా మారాయి.

ఇరవై ఏళ్ల క్రితం అంటే 2002లో గంగవరం పోర్టు దగ్గర విశాఖ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు కోసం స్థానిక మత్యకారుల భూములను తీసుకున్నారని, దానికి పరిహారం ఇంతవరకూ అందలేదని పేర్కొంటూ మత్య్సకారులు పెద్ద ఎత్తున కంటైనర్ టెర్మినల్ ఎంట్రన్స్ వద్దకు చేరి ఆందోళన నిర్వహించారు.

తమకు న్యాయం చేస్తేనే గంగవరం పోర్టు కంటైనర్ కార్యకలాపాలు కొనసాగించేలా చూస్తామని పట్టుబట్టారు. ఆనాడు భూములు ఇచ్చిన వారికి ఇంటికి ఒక ఉద్యోగంతో పాటు అరవై గజాల ఇంటి స్థలం, లక్ష రూపాయలు పరిహారం హామీ ఇచ్చారని ఇప్పటికీ అవి అమలు కాలేదని ఆందోళనకారులు అంటున్నారు.

ఈ రోజుకు 766 మంది బాధితులు ఉన్నారని, వారికి న్యాయం చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. గంగవరం పోర్టు విషయంలో అటు కార్మికులు తమ హక్కుల కోసం ఒక వైపు ఆందోళన చేస్తూంటే భూములు కోల్పోయామని హామీలు అమలు చేయడంలేదని ఇంకో వైపు బాధితులు రోడ్డెక్కుతున్నారు. విశాఖలో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య ఉందని, దాన్ని అదానీకి అప్పగిస్తారు అన్న ప్రచారం ఉంది. ఇప్పటికే గంగవరం పోర్టు యాజమాన్యంగా ఉన్న అదానీ వైఖరి మీద పోర్టు సమస్యల మీద కార్మిక లోకం నిర్వాసిత జనం ఆందోళన బాట పడుతోంది.

విశాఖలో గంగవరం పోర్టు స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ తో అంతా గరం గరం గా మారుతోంది. కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటూ అదానీకి అంతా అప్పగిస్తారా అని మండిపడుతున్నాయి. విశాఖ అంటే అదానీనా అని కన్నెర్ర చేస్తున్నాయి. విశాఖతో అదానీ బంధం వాణిజ్యపరమైనది అవుతుందో లేదో కానీ ఆందోళనకు సరికొత్త బంధం వేస్తోంది అంటున్నారు.