గోపీచంద్ మలినేని అంటే మూడువంతులు కామెడీ, ఒకవంతు యాక్షన్. కానీ లేటెస్ట్ గా తీయబోతున్న సినిమా మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వుంటుందని తెలుస్తోంది. రవితేజ హీరోగా చేస్తున్న ఈ కాప్ స్టోరీ తమిళ సేతుపతి, రాజమౌళి విక్రమార్కుడు స్టయిల్ లో వుంటుందని తెలుస్తోంది.
సినిమాలో హీరో డ్యూటీ వ్యవహారాలు, వాటి వల్ల వచ్చే సవాళ్లు, వాటిని ఎలా ఎదుర్కొని విలన్లను మట్టికరిపిస్తాడు లాంటి వన్నీ చాలా ఎమోషనల్ గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అందవల్ల సినిమాలో కామెడీకి స్కోప్ తక్కువ వుంటుందట. రవితేజ ఎగ్రెసివ్ క్యారెక్టరైజేషన్ నే సినిమాకు ప్రధానంగా వుంటుందని తెలుస్తోంది.
సినిమాలో మూడు సంఘనటలు, మూడు ప్లేస్ లు, మూడు కథనాలుగా యాక్షన్ ఎపిసోడ్ లు, ఎమోషన్లు వుంటాయని తెలుస్తోంది. మొత్తంమీద మళ్లీ రవితేజ తనకు నప్పే జోనర్ లోకి వచ్చారన్నమాట.