ఎన్టీఆర్, చరణ్‌తో రాజమౌళి తీస్తున్న మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' డిలే అవుతుందనే వార్తలు మీడియాలో వస్తున్నా కానీ ఆ చిత్ర బృందం అయితే ఇప్పటికీ వచ్చే ఏడాది జులై 30న విడుదలకి సిద్ధమవుతుందనే ధీమాతోనే వున్నారు. బాహుబలి మాదిరిగా ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ వుండదు కనుక జనవరిలో పూర్తవుతుందని ప్లాన్ చేసిన షూటింగ్ పార్ట్ మార్చ్ వరకు సాగినా కానీ అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేయవచ్చునని భావిస్తున్నారు.
ఇద్దరు హీరోలకీ అదే సంగతి చెప్పారట. ఒకవేళ లేట్ అయినా కానీ ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కి వాయిదా పడుతుందే తప్ప మీడియాలో వినిపిస్తున్నట్టుగా వచ్చే ఏడాది వరకు వెళ్లదట. బాహుబలి 2 తప్ప మిగిలిన రాజమౌళి చిత్రాలు జులై లేదా ఆగస్ట్‌లోనే రిలీజ్ అయ్యాయి. కనుక 'ఆర్.ఆర్.ఆర్'కి అదే టైమ్‌లైన్ రిలీజ్ ప్లాన్ చేసారు. కాకపోతే హిందీ, తమిళ భాషలలో అక్కడి పెద్ద చిత్రాలేమైనా క్లాష్ అవుతాయేమో చూసుకోవాలి.
అలాగే ఈ చిత్రం బడ్జెట్ కూడా ముందు అనుకున్నట్టుగా కాకుండా ఒక వంద కోట్లు తక్కువలోనే పూర్తి చేయాలని చూస్తున్నారట. హీరోలు, రాజమౌళి కూడా లాభాలలోనే వాటా తీసుకుంటున్నారట. దీని వల్ల నిర్మాణ వ్యయం పెరగడానికి ఆస్కారం తక్కువేనన్నమాట.