అగ్ర హీరోలతో సినిమాలు లాంఛ్ చేయడానికి టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బలమైన ప్రయత్నాలే చేస్తున్నాడు. పవన్‌కళ్యాణ్‌తో ఇంతవరకు తన బ్యానర్లో సినిమా చేయలేదు కనుక ఆ లోటు భర్తీ చేసుకునేందుకు త్రివిక్రమ్ ద్వారా పవన్‌కి రాయబారం నడుపుతున్నాడు. తమిళంలో అజిత్ చేసిన 'పింక్' రీమేక్ యథాతథంగా పవన్‌కళ్యాణ్‌కి సూట్ అవుతుందని దిల్ రాజు భావిస్తున్నాడు.
పవన్‌కళ్యాణ్ నుంచి ఇంకా ఖచ్చితమైన సమాధానం రాకపోయినప్పటికీ దిల్ రాజు ఇచ్చిన ఆఫర్‌కి పవన్ సుముఖంగా వున్నట్టు సమాచారం. మరోవైపు ప్రభాస్‌తో ఒక పాన్ ఇండియా చిత్రాన్ని లాంఛ్ చేయాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. జెర్సీ రీమేక్‌తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దిల్ రాజు హిందీ మార్కెట్‌ని కూడా టార్గెట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్‌తో ప్లాన్ చేస్తోన్న 'ఐకాన్' కూడా పాన్ ఇండియా మార్కెట్‌కి చేయాలనే ఆలోచన వుందట.
శిరీష్, లక్ష్మణ్‌కి నిర్మాణ బాధ్యతలు అప్పగించిన దిల్ రాజు మీడియం బడ్జెట్ చిత్రాల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదట. అతని దృష్టి మొత్తం ఇప్పుడు భారీ చిత్రాల పైనే వుందని, వచ్చే ఏడాదిలో పవన్, ప్రభాస్, అల్లు అర్జున్‌తో మూడు చిత్రాలు లాంఛ్ చేయనున్నాడని సమాచారం.